PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-00ad0366-0d2c-4f84-bbc7-43730f4b3054-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-00ad0366-0d2c-4f84-bbc7-43730f4b3054-415x250-IndiaHerald.jpgఒకేసారి సినిమా రాజకీయాల్లో కొనసాగాలంటే కుదరని పని. హీరో ఇలా యాక్టివ్ పొలిటికల్ కెరీర్ కొనసాగిస్తూ, సినిమాలు చేస్తానంటే చాలామందికి కష్టమైపోతుంది. ముఖ్యంగా డైరెక్టర్ సినిమాని ముందుకు తీసుకెళ్లలేక ఇబ్బంది పడతాడు. నిర్మాతలు అప్పులు తెచ్చి ఈ సినిమా కోసం డబ్బులు పెడతారు. లేట్ అయితే వడ్డీలు పెరిగిపోయి వారిపై భారం పడుతుంది. సినిమా ఎంత త్వరగా అయిపోతే వీరికి అంత మంచిది. డైరెక్టర్ కూడా ప్రశాంతంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ కు వెళ్ళగలడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కమిట్ అయిన దర్శకులు, నిర్మాతలు చాలా ఇబ్బందులు పpawan {#}Lokesh;Lokesh Kanagaraj;CBN;Hero;Cinema;Director;kalyanఏపీ: పవన్ పైనే వారందరి ఆశలు.. ఇప్పటికైనా కరుణిస్తాడా..??ఏపీ: పవన్ పైనే వారందరి ఆశలు.. ఇప్పటికైనా కరుణిస్తాడా..??pawan {#}Lokesh;Lokesh Kanagaraj;CBN;Hero;Cinema;Director;kalyanTue, 21 May 2024 15:46:00 GMTఒకేసారి సినిమా రాజకీయాల్లో కొనసాగాలంటే కుదరని పని. హీరో ఇలా యాక్టివ్ పొలిటికల్ కెరీర్ కొనసాగిస్తూ, సినిమాలు చేస్తానంటే చాలామందికి కష్టమైపోతుంది. ముఖ్యంగా డైరెక్టర్ సినిమాని ముందుకు తీసుకెళ్లలేక ఇబ్బంది పడతాడు. నిర్మాతలు అప్పులు తెచ్చి ఈ సినిమా కోసం డబ్బులు పెడతారు. లేట్ అయితే వడ్డీలు పెరిగిపోయి వారిపై భారం పడుతుంది. సినిమా ఎంత త్వరగా అయిపోతే వీరికి అంత మంచిది. డైరెక్టర్ కూడా ప్రశాంతంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ కు వెళ్ళగలడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కమిట్ అయిన దర్శకులు, నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

 ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొన్ని నెలలుగా రాజకీయాల కమిట్మెంట్స్ కోసం సినిమాలను మధ్యలోనే వదిలేసి ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వచ్చేస్తున్నాడు. ఫలానా సన్నివేశాన్ని షూటింగ్ పెట్టుకోగానే ఆయన మధ్యలో వెళ్లిపోతున్నాడట. దీనివల్ల టెక్నీషియన్లు, సెట్స్ వేస్ట్ అయిపోతున్నాయి. ఫలితంగా నిర్మాతలకు చిల్లు పడుతుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ షూటింగ్ మధ్యలో నిలిపివేసి రావాల్సి వచ్చింది. ఆయన లోకేష్ ను పరామర్శించాడు. అప్పుడు కొద్ది రోజులు ఆయన బయటే ఉన్నాడు. నిజానికి ఆ సమయంలో పవన్ సినిమాల షూటింగ్ నుంచి బయటికి రాలేకపోయి ఉంటే ఇప్పటికే మూవీలు పూర్తయి ఉండేవి. ఎండాకాలంలో విడుదల కూడా అయిపోయాయి.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎలాంటి పొలిటికల్ కమిట్మెంట్స్ లేవు. మొన్నటి 45 రోజులు దాకా ఆయన ఎండలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాడు. ఇప్పుడు మాత్రం రాజకీయంగా ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటికిప్పుడు సినిమాల షూటింగ్స్‌కు కూడా వెళ్లలేడనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారాల కారణంగా బాగా అలసిపోయాడు. కొద్ది రోజులు ఆయన రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సినిమాలను ఆయన తప్పకుండా పూర్తి చేయాల్సిందే! ఎందుకంటే చాలామంది ఆయనపై నమ్మకం పెట్టుకొని మూవీలను సగం వరకు పూర్తి చేసుకున్నారు. మిగతా సగం కూడా పూర్తయితే అందరూ ప్రయోజనాలు పొందుతారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>