Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/road-side-dabalo-bhojanam-chesina-alluarjun-dampatulu838c5b2d-f36a-4825-b2ef-e62fea3804df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/road-side-dabalo-bhojanam-chesina-alluarjun-dampatulu838c5b2d-f36a-4825-b2ef-e62fea3804df-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే.. ప్రపంచంలో ఎక్కడ, ఏ చిన్న ఘటన జరిగిన క్షణాల్లో మనకు తెలిసి పోతుంది. అంతేకాక ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, ఇతర వీడియోలు కూడా క్షణాల్లో మన ముందు ప్రత్యక్షమవుతుంటాయి.ఇదే సమయంలో ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సాధారణ వ్యక్తుల మాదిరి వివిధ ప్రాంతాల్లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించsocialstars lifestyle{#}shilpa;Nandyala;Audience;Santosham;Tollywood;Andhra Pradesh;media;News;Wife;Allu Arjun;Cinemaరోడ్ సైడ్ దాబా లో భోజనం చేసిన అల్లు అర్జున్ దంపతులు..!!రోడ్ సైడ్ దాబా లో భోజనం చేసిన అల్లు అర్జున్ దంపతులు..!!socialstars lifestyle{#}shilpa;Nandyala;Audience;Santosham;Tollywood;Andhra Pradesh;media;News;Wife;Allu Arjun;CinemaTue, 21 May 2024 14:30:00 GMTప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే.. ప్రపంచంలో ఎక్కడ, ఏ చిన్న ఘటన జరిగిన క్షణాల్లో మనకు తెలిసి పోతుంది. అంతేకాక ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, ఇతర వీడియోలు కూడా క్షణాల్లో మన ముందు ప్రత్యక్షమవుతుంటాయి.ఇదే సమయంలో ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సాధారణ వ్యక్తుల మాదిరి వివిధ ప్రాంతాల్లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ ఫోటో నెటింట్లో వైరల్ అవుతోంది. బన్నీ దంపతులు దాబాలో భోజనం చేస్తున్నట్లు ఆ ఫోటోలు కనిపిస్తుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా కూడా బన్నీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. పుష్పరాజ్ దెబ్బకు అనేక రికార్డులు బద్దలు అయ్యాయి. ఇక ఆ సినిమా ఇచ్చిన హైప్ తో పుష్ప-2 కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ అందరిలో అంచనాలను పెంచేసింది. 'పుప్ప…పుష్ప' అంటూ సాగే సాంగ్ అందరికి పూనకాల్ లోడింగ్ చేసింది.

ఇలా సినిమాలకు సంబంధించిన విషయాలు కాస్త పక్కన పెడితే.. బన్నీ వ్యక్తిగతంగా తరచూ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవలే ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల జిల్లాలో అల్లు అర్జున్ పర్యటించారు. భార్య స్నేహ రెడ్డితో కలిసి బన్నీ నంద్యాల వెళ్లారు. అక్కడ తన స్నేహితుడు,వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈక్రమంలోనే అక్కడికి భారీ ఆయన ఫ్యాన్ వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ దంపతులు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఎక్కడి నుంచో తెలియదు కానీ.. హైదారాబాద్ వస్తున్న క్రమంలో ఓ దాబా వద్ద బన్నీ దంపతులు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతంలో ఈ దాబా అనే విషయాలకు సంబంధించి మాత్రం పూర్తి సమాచారం తెలియదు. అల్లు అర్జున్ దంపతులు ఓ సాదా సీదా దాబాలో భోజనం చేస్తున్న ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. బన్నీ ఫోన్ లో మాట్లాడుతుండగా పక్కనే స్నేహరెడ్డి భోజనం చేస్తూ కనిపించారు. తమ అభిమాన హీరో..సాధారణ వ్యక్తిలా ఓ దాబాలో భోజనం చేయడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. బన్నీ దంపతులకు సంబంధించి వైరల్ అవుతోన్న ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>