PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-e378b840-8ac0-4c04-89dc-65e95f387cb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-e378b840-8ac0-4c04-89dc-65e95f387cb4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని కీలక నియోజకవర్గాలు హాట్ టాపిక్ గా మారాయి. వీటిలో కుప్పం ఒకటైతే, ఇంకొకటి పిఠాపురం అని చెప్పుకోవచ్చు. ఈ స్థానాల నుంచి ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. పవన్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఇక్కడి నుంచి ఎలాగైనా గెలవాలని బాగా ప్రచారం చేశారు. ఆయన తరపున జబర్దస్త్ ఆర్టిస్టులు, మెగా ఫ్యామిలీ కూడా ప్రచారం చేసింది. అయితే పవన్ గెలవకపోతే ఈ నియోజకవర్గంలో జూన్ 4న భయంకరమైన హింసాత్మక ఘటనలకు పాల్పడాలని కొందరు ప్లాన్ చేస్తున్నట్PAWAN {#}Jabardasth;pithapuram;vehicles;Janasena;Andhra Pradesh;Yevaru;geetha;Traffic police;kuppam;YCP;TDP;CBN;Juneఏపీ: జూన్ 4న అక్కడ హింసాత్మక ఘటనలకు ప్లాన్..??ఏపీ: జూన్ 4న అక్కడ హింసాత్మక ఘటనలకు ప్లాన్..??PAWAN {#}Jabardasth;pithapuram;vehicles;Janasena;Andhra Pradesh;Yevaru;geetha;Traffic police;kuppam;YCP;TDP;CBN;JuneTue, 21 May 2024 18:53:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని కీలక నియోజకవర్గాలు హాట్ టాపిక్ గా మారాయి. వీటిలో కుప్పం ఒకటైతే, ఇంకొకటి పిఠాపురం అని చెప్పుకోవచ్చు. ఈ స్థానాల నుంచి ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. పవన్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఇక్కడి నుంచి ఎలాగైనా గెలవాలని బాగా ప్రచారం చేశారు. ఆయన తరపున జబర్దస్త్ ఆర్టిస్టులు, మెగా ఫ్యామిలీ కూడా ప్రచారం చేసింది. అయితే పవన్ గెలవకపోతే ఈ నియోజకవర్గంలో జూన్ 4న భయంకరమైన హింసాత్మక ఘటనలకు పాల్పడాలని కొందరు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ తెలుసుకుందట.

 జూన్ 4న చాలా జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. కౌంటింగ్ రోజు పిఠాపురంలో హింసాత్మక అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున భద్రతా బలగాలని పెంచాలని ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఈసీకి సూచించినట్లు సమాచారం. పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేశారు. ఆమె ఓడిపోయినా వైసీపీ నేతలు పెద్ద అలర్లకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం అనుమాన పడుతోంది. పోలీస్ అధికారులను కూడా దీని గురించి హెచ్చరించింది.

జనసేన కార్యకర్తలు ఇక్కడ పవన్ ని గెలిపించడానికి ఎంతో ప్రయత్నించారు. ఓడిపోతే వాళ్లు హింసాత్మకంగా మారే ఛాన్స్ ఉందట. దాడులకు తెగబడాలనే ఉద్దేశంతో ఆల్రెడీ కొన్ని ప్రణాళికలు కూడా వారు రచించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక పోలింగ్ తేదీ నాడు చాలా చోట్ల అనేక చెడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రభుత్వ ఆస్తులకు కూడా నష్టం వాటిల్లింది. లెక్కింపు తేదీన కూడా ఇదే రేంజ్ లో గొడవలు జరుగుతాయా అనే భయం కూడా చాలా మందిలో నెలకొన్నది. ఏదేమైనా ఈ పోలింగ్ తేదీన జరిగిన గొడవలు ఏపీ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఈ గొడవలు చంద్రబాబు చేయించారని వైసీపీ వాళ్లు ఆరోపించారు. వైసీపీ వాళ్లే ఈ గొడవలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ టీడీపీ వాళ్ళు ఒక పెన్ డ్రైవ్ కూడా డీజీపీకి అందజేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>