PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp95b04472-231b-4926-98fc-d9fa063a15a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp95b04472-231b-4926-98fc-d9fa063a15a9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సాయి అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. వైసీపీ వాళ్ళు 150కి పైగా తమకు సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇక టీడీపీ సోషల్ మీడియా వింగ్, మీడియా వింగ్, టీడీపీ నేతలు తమకు ఎన్ని సీట్లు వస్తాయో లెక్కలు వేసుకుంటున్నారు. వేసుకున్న తర్వాత వారు ప్రకటించలేదు కామ్‌గానే ఉన్నారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ అనేది తామే గెలుస్తాం ఈ సారి అని చెబుతున్నాయి. ఇక మీడియా వింగ్ అనేది గత ఎన్నికల్లో గెలుచుకున్న 40% ఓట్లతో పోలిస్తే టీడీపీకి ఈసారి 45 TDP{#}Andhra Pradesh;Jagan;June;Yevaru;Nijam;Janasena;Assembly;media;TDP;YCPఏపీ: టీడీపీ ఫైనల్ అంచనా ఇదే.. భలే లెక్కలేసారుగా..??ఏపీ: టీడీపీ ఫైనల్ అంచనా ఇదే.. భలే లెక్కలేసారుగా..??TDP{#}Andhra Pradesh;Jagan;June;Yevaru;Nijam;Janasena;Assembly;media;TDP;YCPTue, 21 May 2024 09:13:00 GMT ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సాయి అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. వైసీపీ వాళ్ళు 150కి పైగా తమకు సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇక టీడీపీ సోషల్ మీడియా వింగ్, మీడియా వింగ్, టీడీపీ నేతలు తమకు ఎన్ని సీట్లు వస్తాయో లెక్కలు వేసుకుంటున్నారు. వేసుకున్న తర్వాత వారు ప్రకటించలేదు కామ్‌గానే ఉన్నారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ అనేది తామే గెలుస్తాం ఈ సారి అని చెబుతున్నాయి. ఇక మీడియా వింగ్ అనేది గత ఎన్నికల్లో గెలుచుకున్న 40% ఓట్లతో పోలిస్తే టీడీపీకి ఈసారి 45 శాతం ఓట్లు రావచ్చు అని అంచనా వేస్తోంది. అలాగే జనసేన పార్టీకి పోయినసారి 6% ఓట్లు వస్తే ఈసారి ఆ శాతం 10 వరకు పెరుగుతుందని అంచనా వేసింది. భారతీయ జనతా పార్టీకి పోయినసారి 0.8 శాతం ఓట్లు రాగా ఈసారి రెండు శాతానికి ఓట్లు పెరుగుతాయని కూడా టీడీపీ మీడియా చెబుతోంది.

ఈ లెక్కను చూసుకుంటే టీడీపీ కూటమికి 45+10+2= 57 శాతం ఓట్లు రావచ్చు. వైసీపీ పార్టీకి సంబంధించిన సంప్రదాయ ఓటు శాతం మూడు శాతం తగ్గినట్లు కూడా టిడిపి మీడియా వర్గాలు చెబుతున్నాయి. అంటే పోయినసారి ఓటు శాతంతో పోల్చుకుంటే 47 శాతానికి వైసీపీ ఓట్లు తగ్గాయి. ఈ లెక్కలన్నీ వేసుకుని చివరికి వైసిపి 35% ఓట్లకే సరిపెట్టుకుంటుందని టీడీపీ మీడియా నమ్ముతోంది. ఇదే తమ ఫైనల్ అంచనగా చెబుతోంది. అంటే ఈ మీడియా ప్రకారం టీడీపీ ప్లస్ కూటమి ఈసారి పూర్తి మెజారిటీతో జగన్ పై విజయం సాధించవచ్చు.

అయితే ఏమో ఈ లెక్కలన్నీ కాకి లెక్కలని ఇవేమీ నిజం కావని వైసీపీ శ్రేణులు పారేస్తున్నాయి. మీకు మీరే లెక్కలు చేసుకుని గెలిచేస్తామని అనుకుంటే సరిపోతుందా? అక్కడ ప్రజలు ఓట్లు వేయొద్దా? 45 శాతం టీడీపీకి, 10% జనసేన కి వస్తాయని అంచనా వేసుకోవడమే పెద్ద హాస్యాస్పదం అని వైసీపీ మద్దతు దారులు ఎగతాళి చేస్తున్నారు. ఏది ఏమైనా జూన్ 4వ తేదీన లెక్కింపు పూర్తయ్యే వరకు ఎవరి అంచనాలు కరెక్ట్ అనేది చెప్పలేం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>