MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aab2115609-233f-4d1a-9bc4-60be1ce755e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aab2115609-233f-4d1a-9bc4-60be1ce755e6-415x250-IndiaHerald.jpgసినీ తారలు అంటే పెద్ద పెద్ద హోటల్లో భోజనాలు చేస్తూ ఉంటారు. ఏదైనా అవసరం పడి బయట ప్రాంతాలకు వెళ్లినా కూడా అత్యంత అధునాతనమైన హోటల్స్ లో ఉంటారు. దానికి ప్రధాన కారణం వారి స్టేటస్ అయి ఉండవచ్చు లేక ఎక్కడ పడితే అక్కడ ఉండడం వల్ల వారికి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా అయి ఉండవచ్చు. ఇలా అనేక కారణాల వల్ల ఎక్కువ శాతం వారు అనేక వసతులు ఉన్న ప్రాంతాలలోనే జీవిస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం కొన్ని సందర్భాలలో తమ స్టేటస్ ను , భద్రతా విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా చిన్న చిన్న హోటల్ లలో తినడం , చిన్న కారులలో ప్రయాణింAa{#}Allu Arjun;Wife;Reddy;Cinemaమరోసారి సింప్లీసిటీని చాటుకున్న అల్లు అర్జున్.. రోడ్డు పక్క దాబాలో భోజనం..!మరోసారి సింప్లీసిటీని చాటుకున్న అల్లు అర్జున్.. రోడ్డు పక్క దాబాలో భోజనం..!Aa{#}Allu Arjun;Wife;Reddy;CinemaTue, 21 May 2024 15:09:00 GMTసినీ తారలు అంటే పెద్ద పెద్ద హోటల్లో భోజనాలు చేస్తూ ఉంటారు. ఏదైనా అవసరం పడి బయట ప్రాంతాలకు వెళ్లినా కూడా అత్యంత అధునాతనమైన హోటల్స్ లో ఉంటారు. దానికి ప్రధాన కారణం వారి స్టేటస్ అయి ఉండవచ్చు లేక ఎక్కడ పడితే అక్కడ ఉండడం వల్ల వారికి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా అయి ఉండవచ్చు. ఇలా అనేక కారణాల వల్ల ఎక్కువ శాతం వారు అనేక వసతులు ఉన్న ప్రాంతాలలోనే జీవిస్తూ ఉంటారు.

కానీ కొంత మంది మాత్రం కొన్ని సందర్భాలలో తమ స్టేటస్ ను , భద్రతా విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా చిన్న చిన్న హోటల్ లలో తినడం , చిన్న కారులలో ప్రయాణించడం చేస్తూ చాలా సింప్లిసిటీగా జీవిస్తూ చాలా మంది కి ఆదర్శంగా ఉంటారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.

ఈయన పరిస్థితిలను బట్టి పెద్ద పెద్ద హోటల్లో భోజనాలు చేయడం , పెద్ద కార్లలో తిరగడం , 5 స్టార్ హోటల్స్ లో ఉండడం ఇలా చేసినప్పటికీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం ఈయన అతి సాధారణమైన పౌరునిలా కూడా జీవిస్తూ ఉంటాడు. తాజాగా అల్లు అర్జున్ ఒక పని చేశాడు. దాని వల్ల ఈయన సింప్లిసిటీ ఏమిటో బయటపడింది. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ , నంద్యాలకు వెళ్లిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇక నంద్యాలకు వెళ్లి వస్తున్న సమయం లో రోడ్డు పై ఉన్న ఓ దాబాలో అల్లు అర్జున్ ఫుడ్ టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ అతని భార్య స్నేహ రెడ్డి తో కలిసి ఒక చిన్న హోటల్లో భోజనం చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి అల్లు అర్జున్ ఇంత చిన్న హోటల్లో ఎప్పుడు భోజనం చేశాడు, ఇలాంటివన్నీ కూడా ఆయన టీం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>