Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood84bf05c9-2079-453b-ae64-ba88b0f0df6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood84bf05c9-2079-453b-ae64-ba88b0f0df6d-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. అప్పటివరకు సాదాసీదా హీరోగా ఉంటూ వరుస ప్లాపులతో సతమతమైన వారు.. ఆ తర్వాత ఒక్క సూపర్ హిట్ తో స్టార్ హీరోగా ఎదగడం చూస్తూ ఉంటాం. ఇలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారు ఒక్క సినిమా హిట్ తో ఓవర్ నైట్ లో ఇండస్ట్రీలో అందరికీ ఫేవరెట్ హీరోగా మారిపోతూ ఉంటారు. అయితే సక్సెస్ లు వస్తే ఇలా పైకి దూసుకుపోవడం ఎలా అయితే ఉంటుందో.. ఇక ప్లాపులు వస్తే అదే రీతిలో హీరోల కెరియర్ కూడా డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది. అయితBollywood{#}Tiger Shroff;Industry;Success;Hero;bollywood;Director;Cinemaప్చ్.. రూ.30 కోట్ల నుండి.. రూ.9 కోట్ల రెమ్యూనరేషన్ కు పడిపోయిన హీరో?ప్చ్.. రూ.30 కోట్ల నుండి.. రూ.9 కోట్ల రెమ్యూనరేషన్ కు పడిపోయిన హీరో?Bollywood{#}Tiger Shroff;Industry;Success;Hero;bollywood;Director;CinemaTue, 21 May 2024 10:05:00 GMTసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. అప్పటివరకు సాదాసీదా హీరోగా ఉంటూ వరుస ప్లాపులతో సతమతమైన వారు.. ఆ తర్వాత ఒక్క సూపర్ హిట్ తో స్టార్ హీరోగా ఎదగడం చూస్తూ ఉంటాం. ఇలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారు ఒక్క సినిమా హిట్ తో ఓవర్ నైట్ లో ఇండస్ట్రీలో అందరికీ ఫేవరెట్ హీరోగా మారిపోతూ ఉంటారు. అయితే సక్సెస్ లు వస్తే ఇలా పైకి దూసుకుపోవడం ఎలా అయితే ఉంటుందో.. ఇక ప్లాపులు వస్తే అదే రీతిలో హీరోల కెరియర్ కూడా డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది.


 అయితే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. వరుసగా సక్సెస్ లు వస్తున్నప్పుడు హీరోల రెమ్యూనరేషన్ అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. కానీ అదే హీరో ఫ్లాపుల బాట పట్టాడు అంటే చాలు పారితోషకం తగ్గించుకోకపోతే ఆ హీరోతో సినిమా చేయడానికి కూడా ఏ డైరెక్టర్ ముందుకు రారు. దీంతో ఇలా వరుసలాపులతో పారితోషకం కూడా అంతకంతకు తగ్గుతూ వస్తుంది అని చెప్పాలి. ఇక్కడ బాలీవుడ్లో ఒకప్పుడు యంగ్ స్టార్ హీరోగా  హవా నడిపించిన ఒక నటుడుకి ఇక ఇప్పుడు పారితోషికం అమాంతం తగ్గిపోయింది అన్న వార్త వైరల్ గా మారిపోయింది.


 బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కి ఎంత మంచి గుర్తింపు వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అతను చేసే యాక్షన్ సీన్స్ కి అయితే ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారూ. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు ఈ బాలీవుడ్ హీరో.  ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. దీంతో తన రెమ్యూనరేషన్ భారీగా కట్ చేసుకున్నాడు టైగర్స్ ష్రాఫ్. మొన్నటి వరకు ఒక్కో సినిమాకి 30 కోట్ల వరకు తీసుకున్న ఆయన.. ఇప్పుడు కేవలం ఒక్క సినిమాకి 9 కోట్లు మాత్రమే అడుగుతున్నాడు. ఏదైనా సినిమా హిట్ అయితే మళ్లీ పారితోషకం  పెంచాలని చూస్తున్నాడట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>