MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7cad0f5f-b50a-4de7-92cf-556115fb7931-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7cad0f5f-b50a-4de7-92cf-556115fb7931-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు అక్కినేని నాగచైతన్య. హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తన కధల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ చాలా కూల్ గా కనిపిస్తూ ఉంటాడు నాగచైతన్య. అంతేకాదు సినిమా ఫంక్షన్స్ లో కూడా ఎక్కువగా ఎప్పుడూ బయట కనిపించడు. కేవలం తన సినిమాలతో మాత్రమే బిజీగా ఉంటాడు నాగచైతన్య. అయితే సినిమా విషయంలో కాకుండా సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటాడు.tollywood{#}Car;chandu;geetha;Porsche;India;jeevitha rajaseskhar;Naga Chaitanya;Allu Aravind;Sai Pallavi;sree;Cinema;mediaఅత్యంత ఖరీదైన కారు కొన్న నాగచైతన్య.. రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు..!?అత్యంత ఖరీదైన కారు కొన్న నాగచైతన్య.. రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Car;chandu;geetha;Porsche;India;jeevitha rajaseskhar;Naga Chaitanya;Allu Aravind;Sai Pallavi;sree;Cinema;mediaTue, 21 May 2024 18:00:00 GMTఅక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు అక్కినేని నాగచైతన్య. హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తన కధల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ చాలా కూల్ గా కనిపిస్తూ ఉంటాడు నాగచైతన్య. అంతేకాదు సినిమా ఫంక్షన్స్ లో కూడా ఎక్కువగా ఎప్పుడూ బయట కనిపించడు. కేవలం తన సినిమాలతో మాత్రమే బిజీగా ఉంటాడు నాగచైతన్య. అయితే సినిమా విషయంలో కాకుండా సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య ఒక ఖరీదైన కారు కొనుగోలు

 చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ కారు.. porsche 911 GT3 RS మోడల్ గా తెలుస్తోంది. సిల్వర్ కలర్ లో చాలా స్టైలీష్ గా ఉన్న ఈ కారు ధర దాదాపు రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్.. ఒక్క కారుకి రూ.4 కోట్లా అంటూ అవాక్కవుతున్నారు. ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చందు మండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ భారీ

 బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా కనిపించబోతోంది. ఇక ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాబోతోంది. కాగా ఇందులో నాగచైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నాడు. సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇకపోతే నాగచైతన్య నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా. మరి ఇప్పటివరకు ఇంత పెద్ద సినిమా నాగచైతన్య చేయలేదు స్వయంగా ఈ విషయాన్ని తానే పలు సందర్భాల్లో వెల్లడించారు. మరి ఈ సినిమాతో నాగచైతన్య ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>