BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan808a274f-387d-4094-bdad-eb6812a76dc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan808a274f-387d-4094-bdad-eb6812a76dc8-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు మూడు రోజుల ముందు సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత జనవరి నుంచి మార్చి వరకు వివిధ పథకాలకు నిధులు విడుదల చేసేందుకు సీఎం జగన్ బటన్ నొక్కారు. అయితే ఆ పథకాలకు నిధులు మాత్రం జమ కాలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధులు విడుదల చేయడంపై టీడీపీ అభ్యంతరం చెప్పింది. దీంతో ఈసీ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడాన్ని నిలిపివేసింది. ఈసీ ఆదేశాలతో నష్టపోతున్నామని, పాత పథకాలకే నిధులు విడుదల కాలేదని పలువురు లబ్ధిదారులు హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో మే 10jagan{#}High court;January;Election Commission;March;media;TDP;Jagan;CM;Governmentజగన్‌పై అభాండాలు.. అబద్ధమని తేలిపోయిందిగా?జగన్‌పై అభాండాలు.. అబద్ధమని తేలిపోయిందిగా?jagan{#}High court;January;Election Commission;March;media;TDP;Jagan;CM;GovernmentTue, 21 May 2024 08:20:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు మూడు రోజుల ముందు సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత జనవరి నుంచి మార్చి వరకు వివిధ పథకాలకు నిధులు విడుదల చేసేందుకు సీఎం జగన్ బటన్ నొక్కారు. అయితే ఆ పథకాలకు నిధులు మాత్రం జమ కాలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధులు విడుదల చేయడంపై టీడీపీ అభ్యంతరం చెప్పింది.


దీంతో ఈసీ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడాన్ని నిలిపివేసింది. ఈసీ ఆదేశాలతో నష్టపోతున్నామని, పాత పథకాలకే నిధులు విడుదల కాలేదని పలువురు లబ్ధిదారులు హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో మే 10న ఒక్కరోజు మాత్రమే నిధులు విడుదల చేయాలని హైకోర్టు తీర్పు నిచ్చింది. దీనిపై ఈసీ అభ్యంతరం చెప్పడం.. 10న వాదనలు ముగిసే నాటికి నగదు బదిలీ కాకపోవడం జరిగిపోయాయి. దీంతో పోలింగ్ ముగిసే వరకు డబ్బులు పంపిణీ చేయోద్దని హైకోర్టు సీజే ఆదేశించారు. సీన్ కట్ చేస్తే పోలింగ్ ముగిసిన తర్వాత లబ్ధిదారులకు నిధులు జమ కాలేదు. దీంతో వైసీపీపై , సీఎం జగన్ పై టీడీపీ విమర్శలు చేయడం మొదలు పెట్టింది. జగన్ ఓడిపోతున్నారని తెలిసి ఈ సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. వీటిని ఎల్లో మీడియా కూడా ఫ్రంట్ పేజీలో కథనాలు ప్రచురించింది. తీరా చూస్తే ఇప్పుడు ప్రభుత్వం విడతల వారీగా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తోంది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>