PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/did-you-say-that-jagan-has-no-hope-in-that-one-district-we-are-losingbd9b2833-aa43-424a-a5c8-2763ca205561-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/did-you-say-that-jagan-has-no-hope-in-that-one-district-we-are-losingbd9b2833-aa43-424a-a5c8-2763ca205561-415x250-IndiaHerald.jpg- ఉమ్మ‌డి గుంటూరులో పార్టీ గెలుపు క‌ష్ట‌మ‌ని జ‌గ‌న్ అంచ‌నా - వైసీపీ కంచుకోట‌ల్లో సైతం సైకిల్ నుంచి త‌ప్పిన పోటీ - ఎంపీ సీట్ల‌లో కాపు, బీసీ ప్ర‌యోగం స‌క్సెస్ కాలేదా ? ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కు అశ‌లు లేవా ? ఈ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి తిరుగులేని ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తామని చెబుతున్నా గుంటూరు జిల్లా విషయంలో జగన్‌కు ఎక్కడో సందేహాలు ఉన్నాయా ? అంటే అవుననే చర్చలు వైసిపి వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; ycp; anil kumar; kilari Venkata rosaiah{#}Amaravati;Vijayawada;narasaraopet;Bapatla;Macherla;Capital;Amaravathi;Cycle;Telugu Desam Party;Backward Classes;Vishakapatnam;MP;Telangana Chief Minister;Jagan;Party;YCP;India;Guntur;Parliament;Assemblyఆ ఒక్క జిల్లాలో జ‌గ‌న్‌కు ఆశ‌ల్లేవా... ఓడిపోతున్నామ‌ని చెప్పేశారా ?ఆ ఒక్క జిల్లాలో జ‌గ‌న్‌కు ఆశ‌ల్లేవా... ఓడిపోతున్నామ‌ని చెప్పేశారా ?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; ycp; anil kumar; kilari Venkata rosaiah{#}Amaravati;Vijayawada;narasaraopet;Bapatla;Macherla;Capital;Amaravathi;Cycle;Telugu Desam Party;Backward Classes;Vishakapatnam;MP;Telangana Chief Minister;Jagan;Party;YCP;India;Guntur;Parliament;AssemblyTue, 21 May 2024 12:57:00 GMT- ఉమ్మ‌డి గుంటూరులో పార్టీ గెలుపు క‌ష్ట‌మ‌ని జ‌గ‌న్ అంచ‌నా
- వైసీపీ కంచుకోట‌ల్లో సైతం సైకిల్ నుంచి త‌ప్పిన పోటీ
- ఎంపీ సీట్ల‌లో కాపు, బీసీ ప్ర‌యోగం స‌క్సెస్ కాలేదా ?

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కు అశ‌లు లేవా ? ఈ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి తిరుగులేని ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తామని చెబుతున్నా గుంటూరు జిల్లా విషయంలో జగన్‌కు ఎక్కడో సందేహాలు ఉన్నాయా ? అంటే అవుననే చర్చలు వైసిపి వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల - నరసరావుపేట - గుంటూరు పార్లమెంటు స్థానాలతో పాటు 17 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జగన్ పాలనలో రాజధాని అమరావతిని వికేంద్రీకరించారు. రాజధాని అంతా విశాఖపట్నం తరలించారు. దీంతో అమరావతి ఉద్యమం ఇక్కడ చాలా గట్టిగా నడిచింది.


దీనికి తోడు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణతో పాటు కొందరు కీలక నేతలు పార్టీలు మారిపోయారు.
రాజధాని మార్పు ప్రభావంతో పాటు జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో ఈసారి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి అభ్యర్థుల నుంచి వైసీపీ గట్టి పోటీ ఎదుర్కొంటుంది. చివరకు విజయవాడ ఉభయగోదావరి, ఉత్తరంధ్ర‌ జిల్లాలలో సైతం వైసీపీ అధినేత జగన్‌కు మెజార్టీ సీట్లు వస్తాయన్న ఆశలు ఉన్నా గుంటూరు జిల్లాల మాత్రం ఈసారి జగన్ పెద్దగా నమ్మకాలు పెట్టుకోలేదని చెబుతున్నారు. వైసీపీకి కంచుకోటలుగా ఉన్న గుంటూరు తూర్పు - నరసరావుపేట - బాపట్ల - మాచర్ల నియోజకవర్గాల్లో ఈసారి వైసీపీకి గట్టి పోటీ తప్ప లేదన్న నివేదికలు జగన్ వద్దకు ఇప్పటికే వెళ్లాయి.


గుంటూరు పార్లమెంటు సీట్లు కాపు, నరసరావుపేట పార్లమెంటు సీట్లో బీసీ ప్రయోగం చేసినా అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాలేదని జగన్ స్వయంగా సొంత పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అటు పొన్నూరు, చిల‌క‌లూరిపేట లాంటి చోట్ల కాపు నేత‌ల‌తో జ‌గ‌న్ చేసిన ప్ర‌యోగం కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని కూడా జ‌గ‌న్ సొంత పార్టీ నేత‌ల‌తోనే అన్న‌ట్టు కూడా బ‌య‌ట‌కు లీకులు వ‌స్తున్నాయి. ఓవ‌రాల్‌గా మూడు ఎంపీ సీట్ల‌లో ఒక్కక‌చోట కూడా ఆశ లేదు స‌రిక‌దా... అసెంబ్లీ సీట్ల‌లో మూడు, నాలుగు చోట్ల గ‌ట్టి పోటీలో బ‌య‌ట‌ప‌డ‌తాం అన్న లెక్క త‌ప్పా అంత‌కు మించి ఇక్క‌డ జ‌గ‌న్‌కే పెద్ద‌గా ఆశ‌ల్లేవ్ అని టాక్ ?







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>