PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-bjp-brsp-kcr-bjp3b8c78fa-8e81-4628-b616-33e44f77c5fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-bjp-brsp-kcr-bjp3b8c78fa-8e81-4628-b616-33e44f77c5fc-415x250-IndiaHerald.jpg- బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా దివంగ‌త ఎమ్మెల్యే సోద‌రి నందిత - మొన్న బీజేపీ అభ్య‌ర్థి శ్రీ గ‌ణేష్ ఈ సారి కాంగ్రెస్ క్యాండెట్‌ - మూడు పార్టీల్లోనూ గెలుపుపై ధీమా...! ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) లోక్ స‌భ ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి పెద్దగా చర్చ లేకుండా పోయిందని చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం పార్లమెంట్ ఎన్నికల హడావుడి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు నెలల లోనే కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మ‌ర‌ణం పాలవడంతో ఇప్AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; bjp; brsp; kcr; bjp{#}lasya;nanditha;sree;Car;Narendra;Bharatiya Janata Party;Parliment;Assembly;June;MLA;Congress;India;revanth;Yevaru;Hyderabad;Partyసికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌... గెలిచేది ఎవ‌రంటే...?సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌... గెలిచేది ఎవ‌రంటే...?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; bjp; brsp; kcr; bjp{#}lasya;nanditha;sree;Car;Narendra;Bharatiya Janata Party;Parliment;Assembly;June;MLA;Congress;India;revanth;Yevaru;Hyderabad;PartyTue, 21 May 2024 08:41:15 GMT- బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా దివంగ‌త ఎమ్మెల్యే సోద‌రి నందిత
- మొన్న బీజేపీ అభ్య‌ర్థి శ్రీ గ‌ణేష్ ఈ సారి కాంగ్రెస్ క్యాండెట్‌
- మూడు పార్టీల్లోనూ గెలుపుపై ధీమా...!

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

లోక్ స‌భ ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి పెద్దగా చర్చ లేకుండా పోయిందని చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం పార్లమెంట్ ఎన్నికల హడావుడి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు నెలల లోనే కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మ‌ర‌ణం పాలవడంతో ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక జ‌రిగింది. మల్కాజ్‌గిరి లోక్‌స‌భ తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎనిక‌ జరిగింది. ఇక బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సోదరి నివేదిత పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీజేపీ నుంచి వంశ తిలక్‌ పోటీ చేశారు.


ఈ ఉప ఎన్నికల్లో గెలిచి గ్రేటర్ హైదరాబాద్‌లో సొంతంగా ఖాతా తెరవాలని కాంగ్రెస్ పట్టుదలతో కనిపిస్తోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పట్టు సడల లేదని.. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి నిరూపించుకోవాలని.. ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇక్కడ నెగ్గి అసెంబ్లీలో మరో సీటు పెంచుకోవాలని బీజేపీ కూడా గట్టి ప్రయత్నమే చేసింది. వాస్తవంగా చూస్తే మూడు పార్టీలు గట్టిగా పోటీ ఇచ్చాయి. ఈసారి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ, బీజేపీ అనుకూల పవనాలు తమకు కలిసి వస్తాయన్న నమ్మకంతో బీజేపీ ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తామే గెలుస్తామన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది.


ఇక గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా... గ్రేటర్ అంతా కారు దూసుకుపోయిందని.. ఇప్పుడు ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామన్న ధీమా గులాబీ పార్టీలో కనిపిస్తోంది. అధికార పార్టీ అండదండలు... కంటోన్మెంట్ పరిధిలో పలు సమస్యలకు రేవంత్ పరిష్కారం చూపడంతో.. ఈసారి ఇక్కడ హస్తం హవా కొనసాగుతుందని అధికార పార్టీ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఇలా ఎవరి లెక్కలలో వాళ్లు మునిగి తేలుతున్నారు. మూడు పార్టీల అభ్యర్థులకు గెలుపుపై ధీమా ఎక్కువగానే కనిపిస్తోంది. మరి అంతిమంగా కంటోన్మెంట్లో విజయం ఎవరిని ? వరిస్తుందో జూన్ 4 న తెలిపోనుంది. ఇక్కడ ఎవరు గెలిచినా అది కచ్చితంగా సెన్సేషనల్ అవుతుందనే చెప్పాలి. గెలిచిన పార్టీకి గ్రేటర్ లో కొత్త కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>