MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg ఎట్టకేలకు ‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడంతో ఈసినిమా విడుదల కోసం కమల్ హాసన్ అభిమానులు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ లో విడుదల కాబోతున్న ‘కల్కి’ మూవీలో అదేవిధంగా జూలై లో విడుదల కాబోతున్న ‘ఇండియన్ 2’ లో కమలహాసన్ కీలక పాత్రలో నటిస్తూ ఉండటంతో తిరిగి కమల్ మ్యానియా జాతీయ స్థాయిలో ప్రారంభంకాబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా కమల్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఇండియన్ 2’ గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు మూడవ భాగం కూడ ఉంటుందని అన్నీ అనుకున్నKAMALHASSAN{#}Darsakudu;shankar;June;Elections;media;Director;Cinemaషాకింగ్ భారతీయుడు 3 !షాకింగ్ భారతీయుడు 3 !KAMALHASSAN{#}Darsakudu;shankar;June;Elections;media;Director;CinemaTue, 21 May 2024 08:38:08 GMT
ఎట్టకేలకు ‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడంతో ఈసినిమా  విడుదల కోసం కమల్ హాసన్ అభిమానులు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ లో విడుదల కాబోతున్న ‘కల్కి’ మూవీలో అదేవిధంగా జూలై లో విడుదల కాబోతున్న ‘ఇండియన్ 2’ లో కమలహాసన్ కీలక పాత్రలో నటిస్తూ ఉండటంతో తిరిగి కమల్ మ్యానియా జాతీయ స్థాయిలో ప్రారంభంకాబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి.



ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా కమల్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఇండియన్ 2’ గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు మూడవ భాగం కూడ ఉంటుందని అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ‘భారతీయుడు 3’ మరో ఆరు నెలల గ్యాప్ లో విడుదల అవ్వడం ఖాయం అంటూ కమల్ ఈమధ్య జరిగిన ఐపిఎల్ టోర్నమెంట్ కు వచ్చినప్పుడు తనకు ఎదురైన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన విషయాలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.



వాస్తవానికి ‘ఇండియన్ 2’ మూవీ పై చెప్పుకోతగ్గ స్థాయిలో సగటు ప్రేక్షకులలో క్రేజ్ లేదు. ఈ మూవీ ఎన్నికల ముందు విడుదల అయి ఉంటే అవినీతి మయమైన రాజకీయాల పై ఈమూవీలో ఉన్న పవర్ ఫుల్ డైలాగ్స్ కు జనం బాగా కనెక్ట్ అయి ఉండేవారు. అయితే ఇప్పుడు ఎన్నికలు పూర్తి అవ్వడమే కాకుండా ఫలితాలు తెలిసిపోయి కొత్త ప్రభుత్వాలు ఏర్పాడ్డాక విదులయ్యే ‘ఇండియన్ 2’ పై క్రేజ్ ఏర్పడుతుందా అన్న సందేహాలు చాలమందిలో ఉన్నాయి.



అయితే దర్శకుడు శంకర్ ఏదో ఒక మ్యాజిక్ ఈమూవీలో చేసి ఉంటాడు అని భావిస్తున్నవారు మాత్రం ‘భారతీయుడు 3’ కోసం ‘భారతీయుడు 2’ లో ఏదో ఒక ట్విస్ట్ పెట్టి ఉంటాడు అన్నఅంచనాలతో ఉన్నారు. ఈ మూవీ కోసం శంకర్ రామ్ చరణ్ తో తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీని వెనక్కుపెట్టాడు కాబట్టి ‘భారతీయుడు 2’ పై ఆతరువాత వచ్చే ‘భారతీయుడు 3’ పై గట్టి నమ్మకం ఉంది అనుకోవాలి..  





 










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>