PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/to-decide-the-politics-of-godari-it-is-up-to-shettibalija5f1d935d-eeb4-4701-a454-11e75cb23f98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/to-decide-the-politics-of-godari-it-is-up-to-shettibalija5f1d935d-eeb4-4701-a454-11e75cb23f98-415x250-IndiaHerald.jpg- వైసీపీ నుంచి ఏకంగా రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్లు - రెండు సీట్ల‌లో స‌రిపెట్టేసిన టీడీపీ - ఈ సారి శెట్టిబ‌లిజ నుంచి చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లే లీడ‌ర్లు వీళ్లే..! ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) ఉభయగోదావరి జిల్లాలలో బీసీలలో అతిపెద్ద కులం శెట్టిబలిజ. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో శెట్టిబలిజ, బలిజ పేరుతో కులాలు ఉండడంతో అసలు ఈ శెట్టి బలిజలు ఎవరు ? అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ శెట్టిబలిజ సామాజిక వర్గం వారు కల్లుగీత వృత్తి ప్రధానంగా చేసుకొని గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. మనకు తెలిసి దాదాపు వీAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024;politics; Godari ; Shettibalija; chelluboina Venugopal Krishna {#}Krishna River;Pilli Subhash Chandra Bose;Balija;East Godavari;narasapuram;Narsapur;srinivas;Godavari River;Vishakapatnam;Doctor;Yevaru;Telugu Desam Party;Jagan;Parliament;Lawyer;Assembly;history;India;Andhra Pradesh;Minister;Rajahmundry;YCP;Partyగోదారి రాజ‌కీయం డిసైడ్ చేయాలంటే ' శెట్టిబ‌లిజ ' కే సొంతం..!గోదారి రాజ‌కీయం డిసైడ్ చేయాలంటే ' శెట్టిబ‌లిజ ' కే సొంతం..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024;politics; Godari ; Shettibalija; chelluboina Venugopal Krishna {#}Krishna River;Pilli Subhash Chandra Bose;Balija;East Godavari;narasapuram;Narsapur;srinivas;Godavari River;Vishakapatnam;Doctor;Yevaru;Telugu Desam Party;Jagan;Parliament;Lawyer;Assembly;history;India;Andhra Pradesh;Minister;Rajahmundry;YCP;PartyMon, 20 May 2024 08:25:57 GMT- వైసీపీ నుంచి ఏకంగా రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్లు
- రెండు సీట్ల‌లో స‌రిపెట్టేసిన టీడీపీ
- ఈ సారి శెట్టిబ‌లిజ నుంచి చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లే లీడ‌ర్లు వీళ్లే..!

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఉభయగోదావరి జిల్లాలలో బీసీలలో అతిపెద్ద కులం శెట్టిబలిజ. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో శెట్టిబలిజ, బలిజ పేరుతో కులాలు ఉండడంతో అసలు ఈ శెట్టి బలిజలు ఎవరు ? అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ శెట్టిబలిజ సామాజిక వర్గం వారు కల్లుగీత వృత్తి ప్రధానంగా చేసుకొని గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. మనకు తెలిసి దాదాపు వీరికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటరీ సీటుతో పాటు అటు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం పార్లమెంటు స్థానాలలో ఈ సామాజిక వర్గం వారు బలంగా విస్తరించి ఉన్నారు.


శెట్టిబలిజలు గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోనూ, విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కూడా విస్తరించి ఉన్నారు. బీసీలలో బలమైన గౌడ సామాజిక వర్గానికి సోదరులుగా వీరు ఉంటూ ఉంటారు. గౌడ - ఈడిగ - యాత - శ్రీశ‌య‌న - శెట్టిబలిజ ఇవన్నీ గౌడ ఉపకులాల కిందకు వస్తాయి. రాజకీయంగా చూస్తే మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ సామాజిక వర్గం నుంచి రాష్ట్రస్థాయి మంత్రులుగా ఎదిగారు. ఇక శెట్టిబలిజ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే ఎక్కువగా ఉంటూ వస్తుంది. అయితే వైసిపి అధినేత జగన్ 2019 నుంచి ఈ సామాజిక వర్గాన్ని తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. 2019లో కొంత సఫలం కాగా.. ఈసారి ఎన్నడూ లేని విధంగా శెట్టిబలిజలకు రాజ‌కీయంగా స్వర్ణయగం చూపించారు అని చెప్పాలి.


ఉభయ గోదావరి జిల్లాలలో రెండు జనరల్ పార్లమెంటు సీట్లలో నరసాపురం, రాజమండ్రి ఈ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. నరసాపురం నుంచి ప్రముఖ న్యాయవాది గూడూరి ఉమాబాల - రాజమండ్రి నుంచి ప్రముఖ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కు వైసిపి ఎంపీ సీట్లు ఇచ్చింది. అలాగే ఈ రెండు జిల్లాలలో మూడు అసెంబ్లీ సీట్లు కూడా ఈ సామాజిక వర్గానికి జగన్ కేటాయించారు. పాలకొల్లు - రాజమండ్రి రూరల్ - రామచంద్రపురం సీట్లను జగన్ ఈ సామాజిక వర్గానికి కేటాయించారు. అలాగే రాజమండ్రి సిటీ సీటును కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన మార్గాన్ని భరత్‌కు కేటాయించడంతో చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఈ సామాజిక వర్గానికి చాలా మంచి ప్రాధాన్యత లభించినట్లయింది.


ఇక తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌కు ఆచంట సీటు ఇవ్వ‌గా.. కోన‌సీమ‌లోని రామ‌చంద్రాపురం నుంచి శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గంలో యూత్ ఐకాన్‌గా దూసుకుపోతోన్న వాసంశెట్టి సుభాష్‌కు రామ‌చంద్రాపురం సీటు కేటాయించింది. ఈ సారి రామ‌చంద్రాపురం ఇద్ద‌రు శెట్టిబ‌లిజ నేత‌ల పోరాటానికి వేదిక‌గా మారింది. గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల్లో ఈ సీటు నుంచి రెండు ప్ర‌ధాన ప‌క్షాల్లోనూ శెట్టిబ‌లిజ‌లే పోటీ చేయ‌డం హైలెట్‌.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>