EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp2f0fa832-2e8c-460b-8569-bd6788db78fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycp2f0fa832-2e8c-460b-8569-bd6788db78fc-415x250-IndiaHerald.jpgఏపీ అధికార పార్టీ వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలను 2017 నుంచి ఐ ప్యాక్ సంస్థ చూస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆపార్టీ అధికారంలోకి రావడంలో ఆ సంస్థే కీలక భూమిక పోషించింది. ఇక ఈసారి ఎన్నికలకు ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ లేకున్నా ఆ సంస్థ వైసీపీకి పనిచేసింది. తాజాగా ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్ విజయవాడలో ని బెంజ్ సర్కిల్ లోని ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల్లో మనదే గెలుపు అనది వారితో చెప్పారు. ఈ సందర్భంగా ఐ ప్యాక్ బృందానికి ycp{#}Bhumika Chawla;Kanna Lakshminarayana;prasanth;Prashant Kishor;Nijam;Gift;Yevaru;YCP;media;TDP;Jagan;Party;Reddy;Elections;Hanu Raghavapudi;CMవైసీపీ వాళ్లను నడిరోడ్డుపై వదిలేసిందా?.. అసలు నిజం ఇదేనా?వైసీపీ వాళ్లను నడిరోడ్డుపై వదిలేసిందా?.. అసలు నిజం ఇదేనా?ycp{#}Bhumika Chawla;Kanna Lakshminarayana;prasanth;Prashant Kishor;Nijam;Gift;Yevaru;YCP;media;TDP;Jagan;Party;Reddy;Elections;Hanu Raghavapudi;CMMon, 20 May 2024 10:00:00 GMTఏపీ అధికార పార్టీ వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలను 2017 నుంచి ఐ ప్యాక్ సంస్థ చూస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో  ఆపార్టీ అధికారంలోకి రావడంలో ఆ సంస్థే కీలక భూమిక పోషించింది. ఇక ఈసారి ఎన్నికలకు ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ లేకున్నా ఆ సంస్థ వైసీపీకి పనిచేసింది.


తాజాగా ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్ విజయవాడలో ని బెంజ్ సర్కిల్ లోని ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల్లో మనదే గెలుపు అనది వారితో చెప్పారు. ఈ సందర్భంగా ఐ ప్యాక్ బృందానికి జగన్ కొన్ని గిఫ్ట్ లు ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. ఇది అంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు మరో వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే..


పోలింగ్ ముగిసిన తర్వాతే రోజు వైసీపీ సోషల్ మీడియా కార్యాలయాన్ని మూసి వేశారు. ఎవరు ఆఫీసుకు రావాల్సిన పనిలేదని మెసేజ్ చేశారు. వచ్చే నెల వరకు సెలవులు ఇచ్చామని కొంతమందికి .. పూర్తిగా తీసేశామని మరికొంత మందికి మెసేజ్ లు పంపించారు. సోషల్ మీడియా విభాగం అధిపతి సజ్జల భార్గవ్ రెడ్డి కూడా కొద్ది రోజులుగా ఎవరికీ కనిపించడం లేదు. ఆయన వైసీపీ నేతలకు కూడా అందుబాటులోకి రావడం లేదు. దీంతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది అంటూ టీడీపీ తెగ ప్రచారం చేస్తోంది.


అయితే సోషల్ మీడియా వారియర్స్ అయినా.. కార్యకర్తలైన ఎన్నికల ముందే పార్టీకి అవసరం అని ఆ తర్వాత వీరిని పక్కన పెడతారు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాస్తవమే అయినా ఏ పార్టీ కార్యకర్త దీనిని ఒప్పుకోరు. పార్టీ కోసం కుటుంబం కన్నా ఎక్కువ కష్టపడుతుంటారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి కాబట్టి  ఆయా సోషల్ మీడియా విభాగాలను పార్టీ నాయకులు మూసివేశారు. అయితే వైసీపీ పై టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో  నిజం ఉందా లేదా అనేది వైసీపీ నేతలే చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>