Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle30de2d30-3790-4b6a-8e0b-bab0fe80984e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle30de2d30-3790-4b6a-8e0b-bab0fe80984e-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ నేడు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. 41వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అల్లు అర్జున్‌ బర్త్ డే విషెస్‌ తెలిపారు.ఈ ఇద్దరి మధ్య చాలా కాలంగా మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు ఒకరినొకరు బావ.. బావా.. అని పిలుచుకుంటారు. సోషల్‌ మీడియాలో అభినందనలు తెలియజేయాలన్నా ఇలానే వారి మధ్య కన్వర్జేషన్‌ జరుగుతుంది. ఇక తారక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్‌ తెలిపారు బన్నీ.ఈ సందర్భంగా అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌కి సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియో క్లిప్పులను సోషల్‌ మsocialstars lifestyle{#}suma;suma kanakala;sunday;Allu Arjun;Cinema"మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్‌ ది డే బావ"... ఫియర్ ఈజ్‌ ఫైర్‌ అంటున్న బన్నీ..!!"మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్‌ ది డే బావ"... ఫియర్ ఈజ్‌ ఫైర్‌ అంటున్న బన్నీ..!!socialstars lifestyle{#}suma;suma kanakala;sunday;Allu Arjun;CinemaMon, 20 May 2024 17:00:00 GMTఎన్టీఆర్ నేడు బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. 41వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అల్లు అర్జున్‌ బర్త్ డే విషెస్‌ తెలిపారు.ఈ ఇద్దరి మధ్య చాలా కాలంగా మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు ఒకరినొకరు బావ.. బావా.. అని పిలుచుకుంటారు. సోషల్‌ మీడియాలో అభినందనలు తెలియజేయాలన్నా ఇలానే వారి మధ్య కన్వర్జేషన్‌ జరుగుతుంది. ఇక తారక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్‌ తెలిపారు బన్నీ.ఈ సందర్భంగా అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌కి సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియో క్లిప్పులను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు అభిమానులు. ఇద్దరి మధ్య బాండింగ్‌ని తెలియజేసేలా అయా ఫోటోలు, వీడియోలు ఉండటం విశేషం. దీంతో తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఇద్దరు ఒకరి గురించి మరొకరు చెప్పుకున్న విషయాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఒకరియాక్టింగ్‌ గురించి, కెరీర్‌ గురించి ఒక్క మాటల్లో చెప్పుకున్నారు.

గత కొన్నేళ్ల క్రితం ఇద్దరు కలిసి ఒకే ఈవెంట్లో పాల్గొన్నారు. ఇందులో ఎన్టీఆర్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారని బన్నీని యాంకర్‌ సుమ అడిగింది. దానికి కాసేపు ఆలోచించుకున్న అల్లు అర్జున్‌.. రియల్‌ టాలెంట్‌ అని సింపుల్ గా ఒకే వర్డ్ లో తారక్‌ ఏంటో చెప్పేశాడు. ఇక ఎన్టీఆర్‌ వంతు వచ్చింది. బన్నీ గురించి ఒక్క మాటల్లో చెప్పాలంటే.. అనగా, అమేజింగ్‌ ఫ్రెండ్‌. కష్టపడి పైకి వచ్చిన వారిలో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి అని చెప్పారు తారక్‌. దీంతో ఇద్దరూ ఎమోషనల్‌ అయ్యారు. ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతూ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది.ఇక తాజాగా ఎన్టీఆర్‌కి బన్నీ బర్త్ డే విషెస్‌ చెబుతూ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్‌ ది డే బావ.. ఫియర్ ఈజ్‌ ఫైర్‌ అని పేర్కొన్నారు. భయం కూడా అదిరిపోయేలా ఉంది అని ఆయన వెల్లడించారు. ఇక ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఫియర్‌ సాంగ్‌ని ఆదివారం సాయంత్రం విడుదల చేయగా, ఇది ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇందులో తారక్‌ చాలా పవర్‌పుల్‌గా కనిపిస్తున్నారు.మరోవైపు ప్రశాంత్‌ నీల్‌తో చేయబోతున్న సినిమా అప్‌ డేట్‌ ఇచ్చారు. ఆగస్ట్ లో దీన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. దీంతోపాటు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న వార్‌ 2 నుంచి తారక్‌ ఫస్ట్ లుక్‌ రాబోతుందట. అలాగే ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌.. ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాట ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>