MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/-kalki-2898-ad6b4b8da5-a9ea-47e0-95fa-efe088dcf314-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/-kalki-2898-ad6b4b8da5-a9ea-47e0-95fa-efe088dcf314-415x250-IndiaHerald.jpg 'కల్కి 2898ఏడీ' మూవీకి చెందిన ప్రమోషన్స్‌ని మేకర్స్‌ మొదలుపెట్టినప్పట్నుంచీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి, అంచనాలు అంతకంతకూ భారీగా పెరుగుతూ ఉన్నాయి.రీసెంట్‌గా అశ్వద్ధామగా అమితాబ్‌ని చూసినప్పట్నుంచీ, ఈ సినిమా విడుదల తేదీ అయిన 'జూన్‌ 27' కోసం ప్రేక్షకుల రెట్టించిన ఉత్సాహంతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భాషలకు అతీతంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇంకా ఇంగ్లిష్‌ భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్‌ విశేష ఆదరణ పొందింది. అయితే ఇదిలావుంటే.. 'కల్కి వరల్డ్‌’ నుంచి త్వరలో మరో సూపర్‌స్టార్‌ కూడా రివీల్‌ కానKalki 2898 AD{#}vijay kumar naidu;English;producer;Producer;Darling;Hindi;Indian;News;Cinemaకల్కి 2898 ఏడి: కమల్ రోల్ షాకింగ్.. నిడివి అంతేనా?కల్కి 2898 ఏడి: కమల్ రోల్ షాకింగ్.. నిడివి అంతేనా?Kalki 2898 AD{#}vijay kumar naidu;English;producer;Producer;Darling;Hindi;Indian;News;CinemaMon, 20 May 2024 15:55:29 GMT 'కల్కి 2898ఏడీ' మూవీకి చెందిన ప్రమోషన్స్‌ని మేకర్స్‌ మొదలుపెట్టినప్పట్నుంచీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి, అంచనాలు అంతకంతకూ భారీగా పెరుగుతూ ఉన్నాయి.రీసెంట్‌గా  అశ్వద్ధామగా అమితాబ్‌ని చూసినప్పట్నుంచీ, ఈ సినిమా విడుదల తేదీ అయిన 'జూన్‌ 27' కోసం ప్రేక్షకుల రెట్టించిన ఉత్సాహంతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భాషలకు అతీతంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇంకా ఇంగ్లిష్‌ భాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్‌ విశేష ఆదరణ పొందింది. అయితే ఇదిలావుంటే.. 'కల్కి వరల్డ్‌’ నుంచి త్వరలో మరో సూపర్‌స్టార్‌ కూడా రివీల్‌ కానున్నారు.ఇందులో డార్లింగ్ ప్రభాస్‌ 'భైరవ'గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఆ భైరవ ప్రాణమిత్రుడైన బుజ్జి ఈ నెల 22న ప్రేక్షకులకు కనిపించనున్నాడు. అసలు ఎవరా బుజ్జి?.. 'కల్కి వరల్డ్‌’లో ఈ బుజ్జి స్థానం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ చిన్న వీడియోను కూడా మేకర్స్‌ రీసెంట్ గా విడుదల చేశారు. ఆ వీడియోను బట్టి 'బుజ్జి' అంటే పలు ప్రత్యేకతలతో కూడుకున్న భైరవ 'కారు' అని చూస్తుంటే తెలుస్తున్నది.


ఈ నెల 22 వ తేదీన బుజ్జిని పూర్తిస్థాయిలో మేకర్స్‌ రివీల్‌చేస్తారు.ఇంకా అలాగే హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీలో ఓ భారీ ఈవెంట్‌ని ఏర్పాటు చేసి, ఓ పాటను కూడా అక్కడ విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.. 'కల్కి 2898ఏడీ'గా ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ మూవీలో అమితాబ్‌బచ్చన్‌, దీపికా పదుకొనే, దిషా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సీనియర్ నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మహానటి'ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు.కమల్ హాసన్ విలన్ రోల్ అయిన కలి పాత్రలో నటిస్తున్నాడు. కానీ ఈ పాత్ర నిడివి కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. ఖచ్చితంగా షాక్ కి గురి చేసేలా అద్భుతంగా ఉంటుందట. కల్కి సెకండ్ పార్ట్ లో కమల్ క్యారెక్టర్ ఏకంగా 90 నిముషాలు ఉంటుందని సమాచారం తెలుస్తుంది. కమల్ ఈ సినిమాతో పాటే ఇండియన్ 2,3 సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కేవలం 6 నెలల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>