Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle77073b24-dff6-4a64-a7d8-2693480e7f09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle77073b24-dff6-4a64-a7d8-2693480e7f09-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. చాలా ఏండ్లుగా టాలీవుడ్ లో సత్తా చాటుతోంది.ఇప్పటికీ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ క్రేజీ హీరోయిన్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. చాలా కాలంగా అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. socialstars lifestyle{#}anoushka;Prabhas;Akkineni Nagarjuna;Mister;Tollywood;Nijam;marriage;Kannada;Heroine;producer;Producer;Telugu;News;Cinemaపెళ్లికి రెడీ అవుతున్న జేజమ్మ వరుడు ఎవరో తెలుసా..??పెళ్లికి రెడీ అవుతున్న జేజమ్మ వరుడు ఎవరో తెలుసా..??socialstars lifestyle{#}anoushka;Prabhas;Akkineni Nagarjuna;Mister;Tollywood;Nijam;marriage;Kannada;Heroine;producer;Producer;Telugu;News;CinemaMon, 20 May 2024 12:30:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. చాలా ఏండ్లుగా టాలీవుడ్ లో సత్తా చాటుతోంది.ఇప్పటికీ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ క్రేజీ హీరోయిన్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. చాలా కాలంగా అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె పెళ్లి గురించి మీడియాలో రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకోబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మూడు ముళ్ల బంధంతో సంసార జీవితంలోకి అడుగు పెట్టోతోందట. కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన స్టార్ ప్రొడ్యూసర్ ను పెళ్లి చేఉకోబోతోందట. ఇప్పటికీ వీరి పెళ్లికి సంబంధించి పేరెంట్స్ ఓకే చెప్పారట. త్వరలోనే వీరిద్దరికి నిశ్చితార్థం జరపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ బడా నిర్మాత ఎవరు? అనే విషయం మాత్రం బయటకు రాలేదు.

అనుష్క శెట్టి ‘సూపర్’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలో అనుష్క సోనూసూద్ చెల్లిగా నటించింది. తొలి సినిమాతోనే అదం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించకుంది. ‘మిర్చి’, 'అరుంధతి' లాంటి సినిమాలతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ‘బాహుబలి’ సినిమా సమయంలోనే ‘సైజ్ జీరో’ లాంటి సినిమాలో నటించింది. ఇందులో లావుగా కనిపించేందుకు ఎక్కువ బరువు పెరిగింది. ఆ తర్వాత ఆమె పలు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. రీసెంట్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘ఘాటి’ అనే సినిమాలో నటిస్తోంది. ‘బాహుబలి’ సినిమా తర్వాత అనుష్క పెళ్లి గురించి వార్తలు బాగా వచ్చాయి. ప్రభాస్ తో అనుష్క ప్రేమాయణం కొనసాగిస్తోందనే టాక్ వినిపించింది. ఆయననే పెళ్లి చేసుకోబోతోందంటూ టాక్ వినిపించింది. వారి జంట చూడ ముచ్చటగా ఉందంటూ సోషల్ మీడియాలో చర్చలు కూడా జరిగాయి. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదంటూ అనుష్క చాలా సార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. అయితే, గత కొంతకాలంగా అనుష్క సినీ కెరీర్ మరీ స్లో అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది త్వరలోనే తెలియనుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>