PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/repallefa243d1e-4273-4816-8d08-f321c0834966-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/repallefa243d1e-4273-4816-8d08-f321c0834966-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాల్లో రేపల్లె ఒకటి కాగా ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్‌ వైసీపీ అభ్యర్థిగా డా. ఈవూరి గణేష్‌ పోటీ చేస్తున్నారు. ఈవూరి గణేష్ తల్లి చాలా సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలో రద్దైన కూచినపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశారు. 1985, 1989, 1994 ఎన్నికల సమయంలో ఆమె ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. repalle{#}ANAGANI SATYA PRASAD;Repalle;Doctor;Husband;Guntur;Jagan;News;Party;YCPరేపల్లెలో వైసీపీ జెండా ఎగురుతుందా.. జగన్ నమ్మకాన్ని గణేష్ నిలబెట్టుకుంటారా?రేపల్లెలో వైసీపీ జెండా ఎగురుతుందా.. జగన్ నమ్మకాన్ని గణేష్ నిలబెట్టుకుంటారా?repalle{#}ANAGANI SATYA PRASAD;Repalle;Doctor;Husband;Guntur;Jagan;News;Party;YCPMon, 20 May 2024 10:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గాల్లో రేపల్లె ఒకటి కాగా ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్‌ వైసీపీ అభ్యర్థిగా డా. ఈవూరి గణేష్‌ పోటీ చేస్తున్నారు. ఈవూరి గణేష్ తల్లి చాలా సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలో రద్దైన కూచినపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశారు. 1985, 1989, 1994 ఎన్నికల సమయంలో ఆమె ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.
 
ఆమె పేరు ఈవూరి సీతారావమ్మ కాగా 2014 సంవత్సరంలో ఆమె మృతి చెందారు. టీడీపీలో ఈవూరి సీతారావమ్మ క్రియాశీలకంగా పని చేయడంతో పాటు 1995 సంవత్సరంలో ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రిగా పని చేయడం జరిగింది. ఆమె భర్త ఈవూరి సుబ్బారావు 1978 సంవత్సరంలో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం గమనార్హం. 2004లో కూచినపల్లి రద్దై రేపల్లె నియోజకవర్గంలో కలిసిపోయింది.
 
ఆ కుటుంబం నుంచి చాలా సంవత్సరాల తర్వాత డాక్టర్ ఈవూరి గణేష్ రేపల్లె నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఈవూరి గణేష్ సొంతమవుతుందో లేదో చూడాల్సి ఉంది. జగన్ నమ్మకాన్ని గణేష్ నిలబెట్టుకుంటారో లేదో అనే చర్చ జరుగుతుండటం గమనార్హం.
 
అటు ఈవూరి గణేష్, ఇటు అనగాని సత్యప్రసాద్ గౌడ సామాజికవర్గానికి చెందిన నేతలు కావడంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలియాల్సి ఉంది. సర్వేలు కూటమికే ఛాన్స్ ఉందని చెబుతున్నా గెలుపు కోసం గణేష్ కూడా భారీ స్థాయిలో కష్టపడిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈవూరి గణేష్ ఎన్నికల్లో విజయం సాధిస్తే డాక్టర్ అయిన ఆయన కెరీర్ ఇకపై రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
 
 
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>