PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jogi-rameshe191e868-d6e3-453c-9482-aeaf45dd9f03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jogi-rameshe191e868-d6e3-453c-9482-aeaf45dd9f03-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌడ సామాజికవర్గం నుంచి చాలామంది నేతలు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఈసారి పదుల సంఖ్యలో గౌడ కులానికి చెందిన అభ్యర్థులు నిలబడ్డారు. వారిలో జోగి రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయనకు బీసీ గౌడ సామాజికవర్గంపై మంచిపట్టు ఉంది. గౌడ్ సామాజికవర్గానికి చెందిన జోగి రమేష్ కృష్ణా జిల్లాలో బీసీల అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. Jogi Ramesh{#}JOGI RAMESH;RTC;Y. S. Rajasekhara Reddy;Backward Classes;krishna district;Mylavaram;Devineni Uma Maheswara Rao;Penamaluru;Pedana;Lagadapati Rajagopal;dr rajasekhar;Vijayawada;king;King;local language;TDP;MLA;NTR;Telangana Chief Minister;CM;Jagan;YCP;Assembly;Minister;Partyగౌడాంధ్ర‌ప్ర‌దేశ్‌ : జోగి రమేష్ ప్రయాణం అసాధారణం.. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా?గౌడాంధ్ర‌ప్ర‌దేశ్‌ : జోగి రమేష్ ప్రయాణం అసాధారణం.. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా?Jogi Ramesh{#}JOGI RAMESH;RTC;Y. S. Rajasekhara Reddy;Backward Classes;krishna district;Mylavaram;Devineni Uma Maheswara Rao;Penamaluru;Pedana;Lagadapati Rajagopal;dr rajasekhar;Vijayawada;king;King;local language;TDP;MLA;NTR;Telangana Chief Minister;CM;Jagan;YCP;Assembly;Minister;PartyMon, 20 May 2024 08:44:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌడ సామాజికవర్గం నుంచి చాలామంది నేతలు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఈసారి పదుల సంఖ్యలో గౌడ కులానికి చెందిన అభ్యర్థులు నిలబడ్డారు. వారిలో జోగి రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయనకు బీసీ గౌడ సామాజికవర్గంపై మంచిపట్టు ఉంది. గౌడ్ సామాజికవర్గానికి చెందిన జోగి రమేష్ కృష్ణా జిల్లాలో బీసీల అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో పెడన నియోజకవర్గంలో చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2022లో వైసీపీ కేబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. జోగి రమేష్ 1970లో కృష్ణా జిల్లా (ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా), మైలవరం  నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో జన్మించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి శిష్యుడుగా పేరు తెచ్చుకున్నారు.

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక జోగి రమేష్ కు ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పదవిని అందించారు. 2009లో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును జోగి రమేష్ ఆశించారు. అయితే అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆ సీటును జోగి రమేష్ కు ఇవ్వనివ్వలేదు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైనా జోగి రమేష్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించాలని పట్టుబట్టారు. ఆ విధంగా పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు. నాన్ లోకల్ అయినా సరే ఆయనకు ఈ సీటును కట్టబెట్టారు. అలా ఇక్కడ నిలబడిన జోగి రమేష్ టీడీపీ పార్టీ అభ్యర్థి కాగిత వెంకట్‌రావుపై 1,192 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దాంతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత కాంగ్రెస్‌ను వీడారు. తర్వాత జగన్ వైసీపీ పార్టీ స్థాపించడంతో అందులో జాయిన్ అయ్యారు. 2014లో మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా మహేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. 2019లో పెడన నుంచి కంటెస్ట్ చేసే విజయం సాధించారు. ఈసారి అంటే 2024 ఎన్నికలలో పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మూడు నియోజకవర్గాల (మైలవరం, పెడన, పెనమలూరు) నుంచి పోటీ చేసిన ఘనత జోగి రమేష్ కి దక్కుతుందని చెప్పవచ్చు. జోగి రమేష్ జగన్‌కు నమ్మినబంటు. వైఎస్ఆర్ ఎమ్మెల్యే పదవి ఇచ్చి ప్రోత్సహిస్తే జగన్ మంత్రి పదవి ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఈసారి ఆయన గెలిస్తే వైసీపీలో కింగ్ అవుతారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>