Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle569ef95c-9e37-48f4-843c-d106772fb0a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle569ef95c-9e37-48f4-843c-d106772fb0a3-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఈ సినిమా కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కూడా లాభాల వర్షం కురిపించింది.అయితే ఈ సినిమా మాత్రం తన జీవితంలో సంపాదించిన డబ్బు అంతా పోయేలా చేసింది అంటూ ఒక జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ చేశారు. అతను ఎవరో కాదు కమెడియన్ ధనరాజ్. ఒకపక్క జబర్దస్త్ లో నటిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా చిన్నాచితకా కమెడియన్ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకునsocialstars lifestyle{#}Sreemukhi;Bahubali;Cinema Tickets;Samuthirakani;Varsham;Santosham;Comedian;Jabardasth;varun tej;Cinema;Event;Wifeబాహుబలి వల్ల సర్వం కోల్పోయా..అంటున్న జబర్దస్త్ కమెడియన్..!!బాహుబలి వల్ల సర్వం కోల్పోయా..అంటున్న జబర్దస్త్ కమెడియన్..!!socialstars lifestyle{#}Sreemukhi;Bahubali;Cinema Tickets;Samuthirakani;Varsham;Santosham;Comedian;Jabardasth;varun tej;Cinema;Event;WifeMon, 20 May 2024 11:03:16 GMTబాహుబలి సినిమా తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఈ సినిమా కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కూడా లాభాల వర్షం కురిపించింది.అయితే ఈ సినిమా మాత్రం తన జీవితంలో సంపాదించిన డబ్బు అంతా పోయేలా చేసింది అంటూ ఒక జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ చేశారు. అతను ఎవరో కాదు కమెడియన్ ధనరాజ్. ఒకపక్క జబర్దస్త్ లో నటిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా చిన్నాచితకా కమెడియన్ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనరాజ్. జబర్దస్త్ షో తో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాలు చేస్తూ బాగానే కూడబెట్టాడు. అంతా బాగానే ఉంటుంది అనుకున్న సమయంలో ఒక సినిమా నిర్మించి ఆ డబ్బంతా పోగొట్టుకున్నట్లు వెల్లడించాడు.

ధనరాజ్ నిర్మాతగా హీరోగా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో శ్రీముఖి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా వల్లే తాను సంపాదించింది అంతా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తాజాగా ధనరాజ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా వల్ల నష్టపోవడానికి కారణం సినిమా బాగోలేక కాదని, బాహుబలి సినిమా వల్ల ఈ సినిమా నష్టపోయిందని చెప్పుకొచ్చాడు. మా సినిమా చూసిన వారందరూ బాగుందని చెప్పారు, అయితే సినిమా రిలీజ్ టైంలో నేను వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు వాళ్ళ షూటింగ్ నిమిత్తం రాజస్థాన్లో ఉన్నాను. సినిమా రిలీజప్పుడు శ్రీముఖి ఫోన్ చేసి థియేటర్స్ లో టికెట్స్ దొరకడం లేదని చెప్పింది, అప్పుడు చాలా సంతోషం అనిపించింది. అయితే ఆ తర్వాతి వారమే బాహుబలి రిలీజ్ అయింది.

బాహుబలి రిలీజ్ అయ్యాక థియేటర్లోకి ముందుగానే అగ్రిమెంట్ ఉండడంతో మా సినిమాని వారానికే లేపేశారు. దీంతో భారీ నష్టాలు వచ్చాయి. నేను సంపాదించిన డబ్బుతో పాటు ఫ్రెండ్స్ నుంచి అప్పు కూడా చేసి ఆ సినిమా పూర్తి చేశాను. నా డబ్బుతో పాటు అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బు కూడా పోయింది. అప్పుడు నా భార్య ఇదే డబ్బు ఏదైనా ల్యాండ్ మీద పెట్టి ఉంటే కొన్ని కోట్లు అయి ఉండేది. ఇలా చేయడం గురించి ఆమె పెద్దగా నన్ను ఏమీ అనలేదు. అయితే అని చెప్పింది కూడా నిజమే కదా, కానీ నేను ఒక మంచి సినిమా చేయాలని ప్రయత్నం చేశాను. కానీ పూర్తిగా వర్కౌట్ అవ్వలేదు అంటూ ధనరాజ్ పేర్కొన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ధనరాజ్ దర్శకుడిగా మారి సముద్రఖని ప్రధాన పాత్రలో రామ రాఘవం అనే సినిమా చేస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>