MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr03b38129-d993-4ddb-ab45-cdef1f19d166-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr03b38129-d993-4ddb-ab45-cdef1f19d166-415x250-IndiaHerald.jpgచాలా సంవత్సరాల క్రితం విశాల్ హీరోగా రూపొందిన పొగరు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన శ్రేయ రెడ్డి ఆ తర్వాత ఏ సినిమాలలోనూ పెద్దగా కనిపించలేదు. దానితో తెలుగు సినీ ప్రేమికులు కూడా ఇవ్వను దాదాపుగా మర్చిపోయారు. ఇక కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ లో ఈమె నటించింది. ఈ మూవీ లో ఈమె రాధా రమా అనే పాత్ర లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడం , ఈమె పాత్ర కూడSr{#}vishal krishna;Murder.;Manam;prashanth neel;Prasanth Neel;prasanth;Prashant Kishor;Reddy;India;BEAUTY;Telugu;Prabhas;Cinemaఆ టైంలో ప్రశాంత్ నీల్ ను హత్య చేయాలి అనిపించేది... శ్రేయ రెడ్డి..!ఆ టైంలో ప్రశాంత్ నీల్ ను హత్య చేయాలి అనిపించేది... శ్రేయ రెడ్డి..!Sr{#}vishal krishna;Murder.;Manam;prashanth neel;Prasanth Neel;prasanth;Prashant Kishor;Reddy;India;BEAUTY;Telugu;Prabhas;CinemaMon, 20 May 2024 13:24:00 GMTచాలా సంవత్సరాల క్రితం విశాల్ హీరోగా రూపొందిన పొగరు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన శ్రేయ రెడ్డి ఆ తర్వాత ఏ సినిమాలలోనూ పెద్దగా కనిపించలేదు. దానితో తెలుగు సినీ ప్రేమికులు కూడా ఇవ్వను దాదాపుగా మర్చిపోయారు. ఇక కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ లో ఈమె నటించింది. ఈ మూవీ లో ఈమె రాధా రమా అనే పాత్ర లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సినిమా అద్భుతమైన విజయం అందుకోవడం , ఈమె పాత్ర కూడా ఈ మూవీ లో సూపర్ గా ఉండడంతో ఒక్క సారిగా ఈ మూవీ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించింది. ఇంకా సాలార్ పార్ట్ 2 కూడా రావాల్సి ఉంది. అందులో ఈమె పాత్ర మరింత కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లయితే ఈమె క్రేజ్ మరింతగా పెరుగుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో శ్రేయ రెడ్డి మాట్లాడుతూ ... సలార్ షూటింగ్ సమయం లో నేను ఎప్పుడు ప్రశాంత్ నీల్ ను నా పాత్ర ప్రాధాన్యత బలంగా ఉండాలి అని చెబుతూ ఉండేదాన్ని , ఎందుకు అంటూ ప్రభాస్ , పృధ్విరాజ్ సుకుమారన్ లాంటి గొప్ప నటులు ఉన్న సినిమాలలో నా పాత్ర బలంగా ఉండాలి అనేది నా కోరిక.

అలాగే సహజంగా పెద్ద సినిమాల్లో మనం భాగం అయితే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. పెద్ద సినిమాలలో నటించేటప్పుడు నేను ఎలా నటించాలి ఏం చేయాలి అనేది ముందే ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని , కానీ ప్రశాంత్ మాత్రం సెట్స్ లోనే డైలాగ్స్ రాసేవాడు. దానితో ఆయన నా పాత్ర డైలాగ్స్ రాసేటప్పుడు తనిని "ముసిముసిగా నవ్వుతూ" హత్య చేయాలనిపించేది అని శ్రియా రెడ్డి సరదాగా కామెంట్స్ చేసింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>