PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hat-trick-hero-that-is-sure-to-be-a-minister-in-the-cabinet-if-the-alliance-comesc41a286c-6329-4fff-a952-00ff1240b942-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hat-trick-hero-that-is-sure-to-be-a-minister-in-the-cabinet-if-the-alliance-comesc41a286c-6329-4fff-a952-00ff1240b942-415x250-IndiaHerald.jpg- వైసీపీ మంత్రి మోపిదేవిని రెండుసార్లు గింగ‌రాలు కొట్టించిన గట్స్‌న్నోడు - రేప‌ల్లె నుంచి హ్యాట్రిక్ రికార్డు గ్యారెంటీయే - జ‌గ‌న్ ఎత్తులు మూడుసార్లు చిత్తు చేసిన హీరో ( గుంటూరు - ఇండియా హెరాల్డ్ ) రాజ‌కీయంగా ఎలాంటి అనుభ‌వం లేని నేత‌... రాజ‌కీయంగా ద‌శాబ్దాల పాటు కాక‌లు తీరిన యోధుడు.. మంత్రిగా ఉన్న వ్య‌క్తిని వ‌రుస‌గా రెండుసార్లు ఓడించి గింగ‌రాలు కొట్టించ‌డం అంటే మామూలు విష‌యం కాదు.. కానీ రేప‌ల్లె టీడీపీ ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ గౌడ్‌.. ఈ కోవ‌కు చెందిన ఫైర్‌బ్రాండ్ లీడ‌రే. గౌడ సామాజిక వAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; anagani Satya Prasad; minister{#}Mopidevi Venkata Ramana;Backward Classes;Guntur;war;District;TDP;Hanu Raghavapudi;CM;YCP;India;Minister;Partyహ్యాట్రిక్ వీరుడు ' అన‌గాని ' ... కూట‌మి వ‌స్తే కేబినెట్లో మంత్రి గా ప‌క్కా...?హ్యాట్రిక్ వీరుడు ' అన‌గాని ' ... కూట‌మి వ‌స్తే కేబినెట్లో మంత్రి గా ప‌క్కా...?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; anagani Satya Prasad; minister{#}Mopidevi Venkata Ramana;Backward Classes;Guntur;war;District;TDP;Hanu Raghavapudi;CM;YCP;India;Minister;PartyMon, 20 May 2024 08:41:13 GMT- వైసీపీ మంత్రి మోపిదేవిని రెండుసార్లు గింగ‌రాలు కొట్టించిన గట్స్‌న్నోడు
- రేప‌ల్లె నుంచి హ్యాట్రిక్ రికార్డు గ్యారెంటీయే
- జ‌గ‌న్ ఎత్తులు మూడుసార్లు చిత్తు చేసిన హీరో

( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

రాజ‌కీయంగా ఎలాంటి అనుభ‌వం లేని నేత‌... రాజ‌కీయంగా ద‌శాబ్దాల పాటు కాక‌లు తీరిన యోధుడు.. మంత్రిగా ఉన్న వ్య‌క్తిని వ‌రుస‌గా రెండుసార్లు ఓడించి గింగ‌రాలు కొట్టించ‌డం అంటే మామూలు విష‌యం కాదు.. కానీ రేప‌ల్లె టీడీపీ ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ గౌడ్‌.. ఈ కోవ‌కు చెందిన ఫైర్‌బ్రాండ్ లీడ‌రే. గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన అన‌గాని 2009లో ఫ‌స్ట్ టైం రేప‌ల్లె నుంచి పోటీచేసి అప్పుడు మంత్రిగా ఉన్న మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయారు. కానీ చంద్ర‌బాబు అన‌గానిపై ఉన్న న‌మ్మ‌కంతో 2014లో సీటు ఇవ్వ‌గా మోపిదేవిని ఓడించి చెల్లుకు చెల్లు రివేంజ్ తీర్చుకున్నారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో అన‌గాని గెలుపు మాత్రం నిజంగా స్టేట్‌లోనే పెద్ద సెన్షేష‌న‌ల్‌.


ఓ వైపు వైసీపీ ప్ర‌భంజ‌నాన్ని త‌ట్టుకుని... ఆ పార్టీలో బ‌ల‌మైన నేత‌గా ఉన్న మోపిదేవిని వ‌రుస‌గా రెండోసారి అది కూడా ఏకంగా 12 వేల ఓట్ల మెజార్టీతో ఓడించ‌డం అంటే చాలా గ్రేట్‌. ఇదంతా అన‌గాని వ్య‌క్తిగ‌త ఇమేజ్‌.. ఆయ‌న మంచి త‌నంతో పాటు ప‌ద‌వి ఉన్నా లేక‌పోయినా ఎలా ప్ర‌జ‌ల్లో ఉంటారో ?  ఎలాంటి సాయం చేస్తారో ? అనేదానికే నిద‌ర్శ‌నం. అందుకే వైసీపీ  వేవ్ త‌ట్టుకుని టీడీపీ గెలిచిన 23 సీట్ల‌లో రేప‌ల్లె ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో రెండోసారి అన‌గాని గెలిచిన‌ప్ప‌టి నుంచి సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌పై గ‌ట్టి టార్గెట్ పెట్టారు.


గుంటూరు జిల్లా నుంచి గెలిచి ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో ఒక‌రు వైసీపీలోకి వెళ్లినా.. వైసీపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా అన‌గాని మాత్రం పార్టీ మార‌లేదు. ఎలాగైనా ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను ఓడించాల‌ని జ‌గ‌న్ ఎన్నో స్కెచ్‌లు వేశారు. అందుకే అన‌గాని చేతిలో ఓడినా కూడా మోపిదేవికి త‌న కేబినెట్లో మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపారు. అయినా కూడా అక్క‌డ వైసీపీ బ‌ల‌ప‌డలేదు.. అన‌గాని క్రేజ్ ఇసుమంత త‌గ్గ‌లేదు స‌రిక‌దా.. మ‌రింత పెరిగింది. ఇక ఈ ఎన్నిక‌ల్లో మోపిదేవి ఫ్యామిలీని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి డాక్ట‌ర్ ఈపూరు గ‌ణేష్‌కు సీటు ఇచ్చింది. గ‌ణేష్ సైతం పోలింగ్ స‌ర‌ళిని బ‌ట్టి చూస్తే.. అన‌గానికి ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయార‌ని.. రేప‌ల్లెలో టీడీపీ అన‌గానికి వార్ వ‌న్‌సైడ్ అయ‌పోయిందంటున్నారు.


జ‌గ‌న్ సైతం ఇక్క‌డ మోపిదేవి వ‌ల్లే అన‌గానిని ఓడించ‌డం సాధ్యం కాద‌నుకున్న‌ప్పుడే ఇక్క‌డ అన‌గాని హ్య‌ట్రిక్ ఫిక్స్ అయిపోయింది. ఇక అన‌గాని ఎలాగూ గెలుస్తారు.. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డితే బీసీ + గౌడ కోటాలో ఇటు సీనియార్టీ కూడా ఉండ‌డంతో మంత్రి అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌రి అన‌గాని కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రి అయ్యే ల‌క్కీ ఛాన్స్ సొంతం చేసుకుంటారా ? అన్న‌ది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>