PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp857d64d6-0a51-4a54-bdb9-9f69fcbafe2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp857d64d6-0a51-4a54-bdb9-9f69fcbafe2c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే దీనికంటే ముందే జగన్ తనకు 151 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు, 22 కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు. చాలామందికి తన ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చనని, వారందరూ తమకే ఓట్లు వేసి ఉంటారని, దానివల్ల రికార్డు స్థాయిలో తమకు సీట్లు వస్తాయని జగన్ నమ్మకంగా చెప్పారు. వాస్తవానికి టీడీపీ కూటమి నిలబెట్టిన కొంత మంది అభ్యర్థులకు వారి ప్రాంతాల్లో మంచి పేరు ఉంటుంది. వారు సొంత నిధులతో సొంత ycp{#}Kodali Nani;Nellore;Assembly;Bharatiya Janata Party;Government;Parliament;TDP;Parliment;June;Jagan;YCPవైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పందెం రాయుళ్లు.. ఇలా అయిందేంటి..??వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పందెం రాయుళ్లు.. ఇలా అయిందేంటి..??ycp{#}Kodali Nani;Nellore;Assembly;Bharatiya Janata Party;Government;Parliament;TDP;Parliment;June;Jagan;YCPSun, 19 May 2024 19:51:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే దీనికంటే ముందే జగన్ తనకు 151 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు, 22 కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు. చాలామందికి తన ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చనని, వారందరూ తమకే ఓట్లు వేసి ఉంటారని, దానివల్ల రికార్డు స్థాయిలో తమకు సీట్లు వస్తాయని జగన్ నమ్మకంగా చెప్పారు. వాస్తవానికి టీడీపీ కూటమి నిలబెట్టిన కొంత మంది అభ్యర్థులకు వారి ప్రాంతాల్లో మంచి పేరు ఉంటుంది. వారు సొంత నిధులతో సొంత నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తూ, అక్కడ ప్రజల ఓట్లన్నీ తమకే పడేలా చేసుకోగలరు.

అలాంటివారు నిలబడ్డప్పుడు 151 కంటే ఎక్కువ సీట్లు ఒక్క పార్టీయే గెలుచుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. సర్వేలు కూడా జగన్ పార్టీ 117-121 మధ్యలో మాత్రమే సీట్లు గెలుచుకుంటుందని చెబుతున్నాయి. జగన్ తప్ప మిగతా వైసీపీ నాయకులు ఎవరూ కూడా భారీ మెజారిటీతో తాము గెలవబోతున్నామని ధైర్యంగా ప్రకటించలేకపోతున్నారు. కొడాలి నాని వంటి ప్రముఖ వైసీపీ నాయకులు కూడా తాము ఫలానా మెజారిటీతో కలవబోతున్నామని ధైర్యంగా ప్రకటన ఇవ్వలేకపోయారు. వైసీపీ నేతలలో భయం ఉంది కాబట్టే వారు సైలెంట్ గా ఉండిపోయారు అని ఒక ప్రచారం జరుగుతోంది.

అయితే వీరిని పందెం రాయుళ్లు మరింత భయపెడుతున్నారట. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ 130-150 స్థానాలను గెలుచుకుంటుందని వీళ్లు నమ్మారట. పోలింగ్ సమయంలో 90, ఎన్నికల పోలింగ్ తర్వాత 73 నుంచి 75 వరకు మాత్రమే వైసీపీ విన్నయ్యే ఛాన్స్ ఉందనే ఒక అంచనాకి వచ్చారట. ఈసారి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయం అని వారు నమ్ముతున్నారట. ఆ ధీమాతోనే పందేలు సాగుతున్నాయని సమాచారం. భీమవరం, కడప, నెల్లూరు లాంటి ప్రాంతాలలో టీడీపీ+ ఎన్ని అసెంబ్లీ సీట్లను విన్ అవుతుందనే దానిపై బెట్టింగ్స్ నడుస్తున్నాయని వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

టీడీపీ ఓడిపోతుందని ఎవరైనా పందెం వేస్తే వారికి వ్యతిరేకంగా రూపాయికి నాలుగు రూపాయలు ఇస్తామని వేరే వాళ్లు బెట్టింగ్ వేస్తున్నారట. అంటే టీడీపీయే గెలుస్తుందని వారు అంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. టీడీపీ ఒక్కటే 89 నుంచి 92 సీట్లను, కూటమి 104 నుంచి 107 వరకు సీట్లను గెలుచుకుంటుందని బెట్టింగ్ చేసేవారు నమ్ముతున్నారట. తేనె ఆధారంగా వాళ్ళు అలా అలాంటి నమ్మకానికి వచ్చారు అనేది తెలియాలి. కానీ వైసీపీ విజయం పై డౌట్ ఉన్నవారికి వీరి ధోరణి వల్ల మరింత భయం కలుగుతోందని తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>