PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana2780ec19-e770-4509-8bdb-1acadaf0b4b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana2780ec19-e770-4509-8bdb-1acadaf0b4b4-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక పార్లమెంట్ స్థానాలలో ఒకటి అయినటువంటి పెద్దపల్లిలో హోరాహోరి పోరు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బారి మెజారిటీని తెచ్చుకోకపోవడం, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కి రావడంతో ఇక్కడ బీఆర్ఎస్ తన పట్టును చాలా వరకు కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్దపల్లి ఎంపీ సీటును కొప్పుల ఈశ్వర్ దక్కించుకోగా, Telangana{#}vamsi krishna;vivek;Eshwar;Peddapalli;srinivas;vamsi;Father;Assembly;Parliment;Telangana;Congress;MLA;Bharatiya Janata Party;Partyతెలంగాణ : పెద్దపల్లి ఎంపీ అతనే... కాంగ్రెస్ వాళ్ళేంటి ఇలా ఉన్నారు..?తెలంగాణ : పెద్దపల్లి ఎంపీ అతనే... కాంగ్రెస్ వాళ్ళేంటి ఇలా ఉన్నారు..?Telangana{#}vamsi krishna;vivek;Eshwar;Peddapalli;srinivas;vamsi;Father;Assembly;Parliment;Telangana;Congress;MLA;Bharatiya Janata Party;PartySun, 19 May 2024 08:29:12 GMTతెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక పార్లమెంట్ స్థానాలలో ఒకటి అయినటువంటి పెద్దపల్లిలో హోరాహోరి పోరు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బారి మెజారిటీని తెచ్చుకోకపోవడం, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కి రావడంతో ఇక్కడ బీఆర్ఎస్ తన పట్టును చాలా వరకు కోల్పోయింది.

బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్దపల్లి ఎంపీ సీటును కొప్పుల ఈశ్వర్ దక్కించుకోగా, బీజేపీ సీటును గోమాస శ్రీనివాస్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ సీటును గడ్డం వంశీ కృష్ణ దక్కించుకున్నారు. మొదటి నుండి గట్టి పోటీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణ మరియు గోమాస శ్రీనివాస్ మధ్య ఉంటుంది అని ఇక్కడి ప్రజలు అంచనా వేస్తూ వచ్చారు. ఇక ఎలక్షన్లకు ముందు దాదాపుగా గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయం అని అన్నారు.

ఎందుకు అంటే వంశీ యొక్క నాన్న అయినటువంటి గడ్డం వివేక్ ఇదే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న చెన్నూర్ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే కావడం, అలాగే వంశీ యొక్క పెదనాన్న అయినటువంటి గడ్డం వినోద్ కూడా ఇదే పార్లమెంట్ పరిధిలోని బెల్లంపల్లి ఎమ్మెల్యే కావడంతో ఈయనకు క్యాడర్ బలంగా ఉంటుంది. దానివల్ల ఈయన అవలీలగా గెలుపొందుతారు. రెండవ స్థానంలో బీజేపీ , మూడవ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది అని జనాలు అంచనా వేశారు.

కానీ ఎన్నికల తర్వాత పరిస్థితులు చాలా వరకు తారుమారు అయినట్లు కనిపిస్తున్నాయి. మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ ఎలాగో గెలవదు అని ఈ పార్టీని అభిమానించే వ్యక్తులు అంతా బీఆర్ఎస్ కు ఓట్లు వేసినా ప్రయోజనం లేదు. కాంగ్రెస్ ను ఓడించాలి అంటే బీజేపీకి ఓట్లు వేయడమే మంచిది అని ఎక్కువ శాతం బీజేపీ కి ఓట్లు వేసినట్టు తెలుస్తుంది. దానివల్ల బీజేపీ ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ కి కూడా ఈ పార్లమెంట్ పరిధిలో మంచి ఓటు బ్యాంకు ఉంది.

దానితో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బయటికి బహిరంగంగా గెలుపు మాదే అని చెప్తున్నా కూడా మనతో ఉన్న కార్యకర్తలు, మన పార్టీని అభిమానించే వ్యక్తుల తప్ప వేరే వాళ్ళు కాంగ్రెస్ కు ఓటు వేసారా..? అనే అనుమానాలు వారికి కూడా రేకెత్తుతున్నాయి. దీనితో గెలుపు ఖాయం అనుకున్న వంశీ కృష్ణ కు బీజేపీ కాండిడేట్ ఏమైనా దెబ్బేస్తాడా అని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఈ పార్టీని అభిమానించే వ్యక్తులు భావిస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>