MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harish3e44d919-171b-4544-bcf9-39beaf3cf786-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harish3e44d919-171b-4544-bcf9-39beaf3cf786-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ అనే మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత మిరపకాయ్ మూవీ తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఇక మిరపకాయ్ మూవీ తర్వాత ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ తో ఒక్క సారిగా హరీష్ శంకర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గబ్బర్ సింగ్ మూవీ తర్వాత నుండి పవన్ అభిమానులు మరోసారి పవన్ , హరీష్ కాంబోలో ఎప్పుడు మూవీ వస్తుందా అHarish{#}harish shankar;ravi teja;Gabbar Singh;Mister;Ravi;pithapuram;Pawan Kalyan;Industry;Cinema;ram pothineni;Assemblyపవన్ మూవీని పక్కన పెట్టి ప్రస్తుతం రవితేజతో ఆ తర్వాత రామ్ తో.. ఇక ఆ సినిమా లేనట్లేనా..?పవన్ మూవీని పక్కన పెట్టి ప్రస్తుతం రవితేజతో ఆ తర్వాత రామ్ తో.. ఇక ఆ సినిమా లేనట్లేనా..?Harish{#}harish shankar;ravi teja;Gabbar Singh;Mister;Ravi;pithapuram;Pawan Kalyan;Industry;Cinema;ram pothineni;AssemblySun, 19 May 2024 09:54:22 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ అనే మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత మిరపకాయ్ మూవీ తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఇక మిరపకాయ్ మూవీ తర్వాత ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ తో ఒక్క సారిగా హరీష్ శంకర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

గబ్బర్ సింగ్ మూవీ తర్వాత నుండి పవన్ అభిమానులు మరోసారి పవన్ , హరీష్ కాంబోలో ఎప్పుడు మూవీ వస్తుందా అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశారు. ఇక కొన్ని రోజుల క్రితమే మైత్రి సంస్థ వారు పవన్ హీరోగా హరీష్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని ప్రారంభించారు. ఈ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఆ సినిమా ఆగిపోయింది.

ఇక పవన్ రాజకీయ పనులను పూర్తి చేసుకునే లోపు హరీష్ మరో మూవీ పూర్తి చేయొచ్చు అనే ఉద్దేశంతో రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ఇకపోతే పవన్ పిఠాపురం నుండి పోటీలోకి దిగారు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన పవన్ ఈ సారి దాదాపుగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒక వేళ పవన్ గెలిచినట్లు అయితే మరికొన్ని రోజులు కూడా రాజకీయ పనుల్లోనే బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దానితో హరీష్ ఒక వేళ పవన్ గెలిచి రాజకీయ పనులతో బిజీగా ఉంటే ఆ గ్యాప్ లో రామ్ పోతినేని తో ఓ మూవీ చేయాలి అని ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగానే రామ్ తో హరీష్ మూవీ ప్లాన్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఏమైపోతుంది అనే అనుమానం పవన్ అభిమానుల్లో నెలకొంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>