EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan4e8088de-b96d-44f5-8114-f4855bb54049-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan4e8088de-b96d-44f5-8114-f4855bb54049-415x250-IndiaHerald.jpgపోలింగ్ తర్వాత ఏపీలో అనూహ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరికీ వారు తమ గెలుపు అంచనాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అయితే పోలింగ్ జరుగుతున్న దగ్గర నుంచే టీడీపీ అనుకూల మీడియాలో కూటమి గెలిచేస్తుంది అనే తరహాలో కథనాలు ప్రసారమయ్యాయి. అర్ధరాత్రి వరకు వేచి ఉండి మరీ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఏపీ ఓటర్లు నిర్ణయం తీసుకున్నారని తేల్చేసింది. ఇక పోలింగ్ శాతం పెరగడంతో పాటు.. మహిళల ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడంతో గెలుపుపై అటు వైసీపీ, ఇటు టీడీపీ కూటమి నమ్మకంగానే ఉన్నారు. ఇదే సమయంలో పోలింగ్ ముగిసిన తర్వాత గెjagan{#}Josh;Andhra Pradesh;CM;Jagan;June;Party;YCP;TDPక్యాడర్‌లో జోష్‌ నింపేసి.. ఫారిన్‌ చెక్కేసిన జగన్‌?క్యాడర్‌లో జోష్‌ నింపేసి.. ఫారిన్‌ చెక్కేసిన జగన్‌?jagan{#}Josh;Andhra Pradesh;CM;Jagan;June;Party;YCP;TDPSun, 19 May 2024 11:00:00 GMTపోలింగ్ తర్వాత ఏపీలో అనూహ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఎవరికీ వారు తమ గెలుపు అంచనాలపై లెక్కలు వేసుకుంటున్నారు. అయితే పోలింగ్ జరుగుతున్న దగ్గర నుంచే టీడీపీ అనుకూల మీడియాలో కూటమి గెలిచేస్తుంది అనే తరహాలో కథనాలు ప్రసారమయ్యాయి. అర్ధరాత్రి వరకు వేచి ఉండి మరీ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఏపీ ఓటర్లు నిర్ణయం తీసుకున్నారని తేల్చేసింది.


ఇక పోలింగ్ శాతం పెరగడంతో పాటు..  మహిళల ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడంతో గెలుపుపై అటు వైసీపీ, ఇటు టీడీపీ కూటమి నమ్మకంగానే ఉన్నారు. ఇదే సమయంలో పోలింగ్ ముగిసిన తర్వాత గెలుపుపై ధీమా కూటమి  నేతల్లో ఎక్కువగా కనిపించింది. దీంతో పాటు పలువురు వైసీపీ నేతలు నైరాశ్యంలో మాట్లాడటం.. పోలీసులు, అధికారులు టీడీపీ వారికే మద్దతు పలుకుతున్నారిన వైసీపీ నేతలు ఆరోపించడంతో ఇక వైసీపీ పనై పోయిందని అంతా భావించారు.


కూటమి నేతలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంటే వీటిని వైసీపీ నేతలు ఎవరూ కూడా తిప్పి కొట్టే ప్రయత్నం చేయలేదు. ఇలా మూడు రోజులు గడిచిపోయాయి. ఆ తరుణంలో సీఎం జగన్ ఎంట్రీ ఇచ్చారు. ఐ ప్యాక్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పి వైసీపీ శ్రేణులకు ఊపిరిలూదారు. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఈ సారి సీట్లు గెలుస్తున్నామని స్పష్టం చేశారు.


దేశం మొత్తం ఏపీ వైపు చూసే ఫలితాలు జూన్ 4న మీరు చూస్తారంటూ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం సృష్టించబోతుందని పేర్కొన్నారు. ఇక జగన్ మాటలతో ఆ పార్టీ నాయకుల్లో కాస్త ఉత్సాహం కనిపించింది. వైసీపీ గెలుపుపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ ఆ పార్టీ శ్రేణులకు జగన్ ఆశా దీపంలా మారారు. నిన్న మొన్నటి వరకు నిరాశలో మునిగిపోయిన కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్ వచ్చేసింది. మరి ఫలితాలు ఏ విధంగా వస్తాయో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>