PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn-or-jagan-do-you-have-to-experience-it-in-the-endb5f7205f-1bf1-418f-9d98-54f1f5e78143-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn-or-jagan-do-you-have-to-experience-it-in-the-endb5f7205f-1bf1-418f-9d98-54f1f5e78143-415x250-IndiaHerald.jpgఏదో సామెత చెప్పిన విధంగా చంద్రబాబు అనుకూల పత్రికలలో ఒక పత్రికకు బాబు ఏం చేసినా మంచిగా జగన్ ఏం చేసినా తప్పుగా కనిపిస్తుంది. జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సమయంలో రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతుందని రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన ఆ సంస్థ చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు మాత్రం అద్భుతమైన హామీలు అని ఈ హామీలతో పేదల జీవితమే మారిపోతుందని ప్రచారం చేసింది.chandrababu{#}eenadu;Sri Lanka;CBN;Jagan;Telangana;Andhra Pradeshబాబు విషయంలో అలా జగన్ విషయంలో ఇలా.. ఆ పత్రిక లెక్కల గారడీ చూశారా?బాబు విషయంలో అలా జగన్ విషయంలో ఇలా.. ఆ పత్రిక లెక్కల గారడీ చూశారా?chandrababu{#}eenadu;Sri Lanka;CBN;Jagan;Telangana;Andhra PradeshSun, 19 May 2024 14:20:00 GMTఏదో సామెత చెప్పిన విధంగా చంద్రబాబు అనుకూల పత్రికలలో ఒక పత్రికకు బాబు ఏం చేసినా మంచిగా జగన్ ఏం చేసినా తప్పుగా కనిపిస్తుంది. జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సమయంలో రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతుందని రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేసిన ఆ పత్రిక చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు మాత్రం అద్భుతమైన హామీలు అని ఈ హామీలతో పేదల జీవితమే మారిపోతుందని ప్రచారం చేసింది.
 
అయితే ఆ పత్రికల లెక్కల గారడీ చూసి షాకవ్వడం ఏపీ ప్రజల వంతవుతోంది. 2014 సంవత్సరం చంద్రబాబు సీఎం అయ్యే సమయానికి ఏపీ రెవిన్యూ ఆదాయం 65,695 కోట్ల రూపాయలుగా ఉంది. చంద్రబాబు అధికారం కోల్పోయే సమయానికి ఆదాయం లక్షా 14 వేల 654 కోట్ల రూపాయలుగా ఉంది. ఐదేళ్లలో రెవిన్యూ ఆదాయం ఏకంగా 48,995 కోట్ల రూపాయలు పెరగడం గమనార్హం.
 
జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ రెవిన్యూ ఆదాయం లక్షా 11 వేల 34 కోట్ల రూపాయలు కాగా ఈ ఏడాది లక్షా 73 వేల 963 కోట్ల రూపాయలుగా ఉంది. ఐదేళ్లలో ఏపీ ఆదాయం 62 వేల 929 కోట్ల రూపాయలు పెరగగా ఎవరైనా చంద్రబాబు హయాంతో పోలిస్తే జగన్ హయాంలోనే ఆదాయం పెరిగిందని చెబుతారు. అయితే ఈనాడు మాత్రం బాబు పాలనలో ఏపీ ఆదాయం తెలంగాణ కంటే ఎక్కువని ఇప్పుడు మాత్రం తక్కువని చెబుతోంది.
 
పచ్చకామెర్లు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనే విధంగా ఆ పచ్చ పత్రికకు సైతం బాబు హయాంలో అభివృద్ధి కనిపించినట్లు జగన్ పాలనలో అభివృద్ధి కనిపించదు. బాబు చేస్తే అభివృద్ధి జగన్ చేసేవి మాత్రం అప్పులు అనేలా ఆ పత్రిక తీరు ఉంది. బాబు అనుకూల పత్రికల వల్ల జరుగుతున్న దుష్ప్రచారంతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>