MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamal09fd8e3e-3596-4540-9b2b-94b22c8f24be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamal09fd8e3e-3596-4540-9b2b-94b22c8f24be-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ కొన్ని రోజులు ఆగిపోయింది. దాని తర్వాత మళ్లీ ఎన్నో రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ తిరిగKamal{#}lyca productions;rakul preet singh;kajal aggarwal;Music;Indian;shankar;June;News;Cinemaజూలైలో కూడా క్లారిటీ లేని "ఇండియన్ 2"..?జూలైలో కూడా క్లారిటీ లేని "ఇండియన్ 2"..?Kamal{#}lyca productions;rakul preet singh;kajal aggarwal;Music;Indian;shankar;June;News;CinemaSun, 19 May 2024 11:31:00 GMTలోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ కొన్ని రోజులు ఆగిపోయింది. దాని తర్వాత మళ్లీ ఎన్నో రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ అయింది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. దానితో ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ జూన్ నెలలో విడుదల అవుతుంది అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పనులు కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అని నేపథ్యంలో ఈ మూవీ ని జూన్ నెలలో విడుదల చేయడం లేదు అని తెలుస్తుంది. ఇక జూలై నెలలో ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు అందులో భాగంగా ఈ యూనిట్ జూలై 11 లేదా 17వ తేదీల్లో ఈ మూవీ ని విడుదల చేసే అవకాశం ఉన్న కొన్ని వార్తలు వచ్చాయి.

కానీ ఇందుకు సంబంధించి కూడా మేకర్స్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని జూలై 17 వ తేదీన విడుదల చేసేందుకు గాను మేకర్స్ చూస్తున్నట్లు , ఆ తేదీ వరకు పనులు అన్ని అయ్యేట్లు ఉంటే తేదీని మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి ఇండియన్ కు కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>