EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tg-electionsb95ef025-f2ed-42a8-a2ad-296b31d8e0b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tg-electionsb95ef025-f2ed-42a8-a2ad-296b31d8e0b8-415x250-IndiaHerald.jpgఎక్కడ చూసినా ఏపీ ఎన్నికల ఫలితాలపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని.. ఆయా పార్టీలకు జీవన్మరణ సమస్య వంటిదని రకరకాల విశ్లేషణలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ఎంపీ ఎన్నికల ప్రస్తావన రావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఎన్నికలు కూడా తెలంగణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవే. అవును.. అది ఎలా అంటే ఈ ఎన్నికల ఫలితాలపై అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ గంపెడు ఆశలు పెట్టుకుంది. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఇప్పటికే బీజేపీ కీలక నేతలు విమర్శిస్తున్న tg elections{#}Congress;Reddy;Elections;Andhra Pradesh;MP;Telangana;Bharatiya Janata Party;CM;Partyఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో జరగబోయే సంచలనాలు ఇవే?ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో జరగబోయే సంచలనాలు ఇవే?tg elections{#}Congress;Reddy;Elections;Andhra Pradesh;MP;Telangana;Bharatiya Janata Party;CM;PartySun, 19 May 2024 00:30:00 GMTఎక్కడ చూసినా ఏపీ ఎన్నికల ఫలితాలపై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని.. ఆయా పార్టీలకు జీవన్మరణ సమస్య వంటిదని రకరకాల విశ్లేషణలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ఎంపీ ఎన్నికల ప్రస్తావన రావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఎన్నికలు కూడా తెలంగణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవే.


అవును.. అది ఎలా  అంటే ఈ ఎన్నికల ఫలితాలపై అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ గంపెడు ఆశలు పెట్టుకుంది. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఇప్పటికే బీజేపీ కీలక నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఎంపీ ఫలితాలు వారికి అనుకూలంగా వస్తే తెలంగాణలో ఏం జరుగుతుంది అనే చర్చ ఓ వర్గం ప్రజల్లో మొదలైంది. ముఖ్యంగా ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కూడా. ఈ సమయంలో ఆపార్టీకి  తక్కువ ఎంపీ స్థానాలు వస్తే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నట్లే.


ఇదే అదునుగా బీజేపీ తమ కుయుక్తులు ఉపయోగించి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఆ పార్టీ రెండెకల సీట్లు సాధిస్తే రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుంది. అది ఏం చేసినా ప్రజామోదం పొందినట్లే అవుతుంది. పైగా కేంద్రంలో ఒకవేళ అధికారంలోకి వస్తే బీజేపీ ఏం చేయగలతో పలు రాష్ట్రాల్లో చూశాం.


ఒకవేళ కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితాలు అంటే 4-6 స్థానాలే వస్తే సీఎం రేవంత్ రెడ్డి అటు బయట నుంచే కాకుండా ఇంటి పోరును కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న సీనియర్లు అధిష్ఠానం వద్ద తమ పైరవీలు మొదలు పెడతారు. ఇదే సమయంలో బీజేపీ ఈ బలహీనతలను ఉపయోగించుకొని తమ జెండా పాతాలని చూస్తూ ఉంటుంది. ఈ ఎన్నికల్లో 9-12 సీట్లు కనుకు వస్తే సీఎం రేవంత్ రెడ్డికి, ఇటు కాంగ్రెస్  ప్రభుత్వానికి ఢోకా ఉండదు. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>