PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-the-ycp-top-leader-getting-stronger-due-to-cross-voting95265d70-6f55-4627-ad18-77987a4ced3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-the-ycp-top-leader-getting-stronger-due-to-cross-voting95265d70-6f55-4627-ad18-77987a4ced3f-415x250-IndiaHerald.jpg- వేమిరెడ్డికి నెల్లూరు పార్ల‌మెంటులో భారీ క్రాస్ ఓటింగ్‌ - అసెంబ్లీకి మాకు ఎంపీకి టీడీపీకి ఓట్లేయ‌మ‌న్న వైసీపీ క్యాండెట్లు - వైసీపీ విజ‌య‌సాయిరెడ్డికి సొంత పార్టీ వాళ్లే క్రాస్ పోటు పొడిచారా ? ( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ ) ఏపీలో ఒక పార్లమెంటు నియోజకవర్గం లో భారీగా జరిగిన క్రాస్ ఓటింగ్ టీడీపీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించబోతుందా.. అంటే స్థానికంగా అవుననే చర్చ నడుస్తోంది. ఆ పార్లమెంటు సీటు ఏదో కాదు నెల్లూరు పార్లమెంటు సీటు. వాస్తవానికి నెల్లూరు లోక్ స‌భకు వైసీపీ నుంచి ముందుగా జగన్ మాAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; ysrcp; Vijay Sai Reddy; vemireddy prabhkar reddy{#}prashanthi;Vemireddy Prabhakar Reddy;Turmeric;Kovvur;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;prabhakar reddy;Cycle;Wife;Joseph Vijay;Rajya Sabha;CBN;India;Jagan;Parliament;TDP;MP;Elections;YCP;Party;Nelloreక్రాస్ ఓటింగ్ దెబ్బ‌కు వైసీపీ టాప్ లీడ‌ర్ బ‌లవుతున్న‌డా ?క్రాస్ ఓటింగ్ దెబ్బ‌కు వైసీపీ టాప్ లీడ‌ర్ బ‌లవుతున్న‌డా ?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; ysrcp; Vijay Sai Reddy; vemireddy prabhkar reddy{#}prashanthi;Vemireddy Prabhakar Reddy;Turmeric;Kovvur;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;prabhakar reddy;Cycle;Wife;Joseph Vijay;Rajya Sabha;CBN;India;Jagan;Parliament;TDP;MP;Elections;YCP;Party;NelloreSat, 18 May 2024 09:13:18 GMT- వేమిరెడ్డికి నెల్లూరు పార్ల‌మెంటులో భారీ క్రాస్ ఓటింగ్‌
- అసెంబ్లీకి మాకు ఎంపీకి టీడీపీకి ఓట్లేయ‌మ‌న్న వైసీపీ క్యాండెట్లు
- వైసీపీ విజ‌య‌సాయిరెడ్డికి సొంత పార్టీ వాళ్లే క్రాస్ పోటు పొడిచారా ?

( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో ఒక పార్లమెంటు నియోజకవర్గం లో భారీగా జరిగిన క్రాస్ ఓటింగ్ టీడీపీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించబోతుందా.. అంటే స్థానికంగా అవుననే చర్చ నడుస్తోంది. ఆ పార్లమెంటు సీటు ఏదో కాదు నెల్లూరు పార్లమెంటు సీటు. వాస్తవానికి నెల్లూరు లోక్ స‌భకు వైసీపీ నుంచి ముందుగా జగన్ మాజీ రాజ్యసభ సభ్యులు prabhakar REDDY' target='_blank' title='వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటించారు. అయితే జగన్‌తో తలెత్తిన గ్యాప్ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి వెంటనే పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబు ఆయనకు నెల్లూరు పార్లమెంటు సీటుతో పాటు.. ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కొవ్వూరు టిక్కెట్ ఇచ్చారు.


వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీ సీటు ఇచ్చినా పార్టీ మారి టీడీపీ నుంచి బరిలో ఉండడంతో జగన్ అనూహ్యంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంటు బరిలో దింపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు జిల్లాలో పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఎంతోమందికి ఎన్నో సహాయలు చేస్తూ వచ్చారు. విద్యా దానాలు, వైద్యం, ఆరోగ్యం, గుళ్లు గోపురాలు ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో కొన్ని లక్షల మంది ఆయన ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందారు. అందుకే ప్రత్యర్థీ పార్టీలకు చెందిన వారు కూడా వేమిరెడ్డి పై ఎప్పుడు గట్టిగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. ఇప్పుడు విజయ్ సాయిరెడ్డి సైతం వేమిరెడ్డి గెలిచినా.. తాను గెలిచిన ఒక్కటే అని ప్రచారం చేశారు.


అంటే వేమిరెడ్డి పై విమర్శలు చేయటానికి ప్రత్యర్థుల సైతం ఇలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనేందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే నెల్లూరు పార్లమెంటు పరిధిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిలో చాలామంది పార్లమెంటుకు వచ్చేసరికి ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా సైకిల్ కు ఓట్లు వేసినట్టు ఓపెన్ గానే ప్రచారం జరుగుతోంది. విజయసాయి రెడ్డికి సైతం తన గెలుపు పై సందేహాలు ఉన్నాయని.. అందుకే ఎన్నికలు ముగిశాక జరుగుతున్న గొడవలపై వైసీపీలో చాలామంది నేతలు స్పందిస్తున్నా ఆయన మాత్రం మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. ఎప్పుడు మీడియాలోనూ... సోషల్ మీడియాలను చాలా యాక్టివ్ గా ఉండే విజయ్ సాయిరెడ్డికి తన ఓటమిపై సందేహాలు ఉన్నాయని.. అందుకే ఆయన చాలా మౌనంగా ఉంటున్నారని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>