Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanthafe97ac8-bd3c-43a1-84b2-a38d4dac5d93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanthafe97ac8-bd3c-43a1-84b2-a38d4dac5d93-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కనుమరుగవుతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాని అయినా దక్కించుకోగలరా అనే పరిస్థితి నుంచి ఏకంగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ను ఓడించి మెజారిటీ సీట్లలో విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇదంతా అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కారణంగానే సాధ్యమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొRevanth{#}revanth;Parliment;Revanth Reddy;Deputy Chief Minister;Kumaar;Congress;Telangana;Assembly;Parliament;Party;రాజీనామాషాకింగ్ : రాజీనామాకు సిద్ధమైన రేవంత్?షాకింగ్ : రాజీనామాకు సిద్ధమైన రేవంత్?Revanth{#}revanth;Parliment;Revanth Reddy;Deputy Chief Minister;Kumaar;Congress;Telangana;Assembly;Parliament;Party;రాజీనామాSat, 18 May 2024 06:27:00 GMTతెలంగాణలో కనుమరుగవుతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాని అయినా దక్కించుకోగలరా అనే పరిస్థితి నుంచి ఏకంగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ను ఓడించి మెజారిటీ సీట్లలో విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇదంతా అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కారణంగానే సాధ్యమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.


 అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటీవలే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం రేవంత్ తీవ్రంగా శ్రమించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇక తమ పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్ షోలు నిర్వహిస్తూ ఇక బిజీబిజీగా గడిపారు అని చెప్పాలి. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది అని అందరూ అంచనా వేశారు. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు జరగబోతున్నాయి అన్నది తెలుస్తుంది.


 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి ఇక రేవంత్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక మరో కీలక నేత పగ్గాలు చేపట్టబోతున్నాడట. ఈ క్రమంలోనే ఈ పదవిని ఆశిస్తున్న వారిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ రేస్ లో ఉన్నారు అన్నది తెలుస్తుంది. మరి వీరిలో ఎవరికి ఇక పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ దిగిపోయిన తర్వాత పార్టీలో ఏం జరగబోతుంది అనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>