MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg శ్రీదేవి నట వారశురాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఇప్పటివరకు మంచి క్రేజ్ ను సంపాదించుకుంది కానీ కెరియర్ కు సంబంధించి ఒక బ్లాక్ బష్టర్ హిట్ ఆమె ఇంకా అందుకోలేదు. నటిగా ఇప్పటికే మంచి మార్కులు పొందుతున్న జాన్వీ జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తున్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థానం కోసం పోటీ పడుతోంది. ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే ఆమె రామ్ చరణ్ తో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్న పరిస్తితులలో జాన్వీ ఆశలు అన్నీ టాలీవుడ్ చుట్టూనే ఉన్నాయి. ఈ సినిమాలు చేస్తూనే నటిగjahnvikapoor{#}Ram Charan Teja;Raaj Kumar;Jr NTR;sharan;Cricket;bollywood;Indian;Wife;India;Hero;Tollywood;Heroine;Cinemaజాన్వీకపూర్ కష్టాలు !జాన్వీకపూర్ కష్టాలు !jahnvikapoor{#}Ram Charan Teja;Raaj Kumar;Jr NTR;sharan;Cricket;bollywood;Indian;Wife;India;Hero;Tollywood;Heroine;CinemaSat, 18 May 2024 13:51:00 GMT
శ్రీదేవి నట వారశురాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఇప్పటివరకు మంచి క్రేజ్ ను సంపాదించుకుంది కానీ కెరియర్ కు సంబంధించి ఒక బ్లాక్ బష్టర్ హిట్ ఆమె ఇంకా అందుకోలేదు. నటిగా ఇప్పటికే మంచి మార్కులు పొందుతున్న జాన్వీ జూనియర్ ఎన్టీఆర్ తో నటిస్తున్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థానం కోసం పోటీ పడుతోంది.



ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే ఆమె రామ్ చరణ్ తో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్న పరిస్తితులలో జాన్వీ ఆశలు అన్నీ టాలీవుడ్ చుట్టూనే ఉన్నాయి. ఈ సినిమాలు చేస్తూనే నటిగా తనను తాను నిరూపించు కోవడానికి ఈమె బాలీవుడ్ లో చాల డిఫరెంట్ సినిమాలను చేస్తోంది. ఈ నెలాఖరు మే 31 విడుదల కాబోతున్న ‘మిస్టర్ అండ్ మిసెస్’ మహీ మూవీపై జాన్వీ చాలా ఆశలు పెట్టుకుంది.



రాజ్ కుమార్ రావు హీరోగా శరణ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాలో క్రికెటర్ గా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైన హీరో ఆ గోల్ ని డాక్టరైన తన భార్య ద్వారా ఎలా  నెరవేర్చుకున్నాడు అన్న ఆశక్తికర పాయింట్ మీద అల్లబడ్డ మూవీ కథ ఇది అంటున్నారు. సాధారణంగా ఇప్పటివరకు లేడీ క్రికెటర్ల జీవితాల పై తీసిన సినిమాలు అతి తక్కువ. ఆమధ్య ఇలాంటి సినిమాలో తాప్సీ చాల కష్టపడి నటించినప్పటికీ ఆమూవీ సక్సస్ కాలేదు.



అయితే ఇప్పుడు విడుదల కాబోతున్న ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ మూవీ కోసం జాన్వీ కపూర్ రెండేళ్లు కఠినంగా ఆటను ప్రాక్టీస్ చేసిందట. ఈ ఆట ప్రాక్టీస్ లో ఆమెకు అనేక గాయాలు కూడ తగిలాయి. సహజత్వం కోసం విఎఫెక్స్ అవసరం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు కోచ్ ల సహాయంతో క్రికెట్ ఆటను ఆమె పూర్తిగా నేర్చుకుంది. ఈసినిమా విడుదల అయ్యాక ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తాయని ఆమె ఆశ..    














మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>