Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deathfa43e8db-c7b2-4a9a-adcd-3d9a05f0bffc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deathfa43e8db-c7b2-4a9a-adcd-3d9a05f0bffc-415x250-IndiaHerald.jpgకాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. డిజిటల్ యుగంలో ప్రతి మనిషి జీవనాన్ని గడుపుతున్నాడు. ఒకప్పటిలా కాకుండా మూఢనమ్మకాలను వదిలేసి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. ఒక రకంగా మంచి చదువులు చదువుకున్న ప్రతి మనిషి వికాసవంతుడిగా మారిపోతున్నాడు. కానీ ఎందుకో ఒకప్పటి మూఢనమ్మకాలను మాత్రమే కాదు.. బంధాలు బంధుత్వాల మధ్య ఉన్న ప్రేమానురాగాలను కూడా పూర్తిగా మరచిపోతున్నాడు మనిషి. ఒకప్పుడు ఆస్తులకు కాదు.. అనుబంధాలకి ఎక్కువ విలువ ఉండేది. ఏకంగా బంధాల కోసం ఆస్తులు వదిలేసుకున్న వారు కూడాDeath{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Apple;Sonyఅమానవీయ ఘటన.. పాపం ఆ తల్లికేం తెలుసు.. చనిపోయాక పిల్లలు ఇలా చేస్తారని?అమానవీయ ఘటన.. పాపం ఆ తల్లికేం తెలుసు.. చనిపోయాక పిల్లలు ఇలా చేస్తారని?Death{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Apple;SonySat, 18 May 2024 11:30:00 GMTకాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. డిజిటల్ యుగంలో ప్రతి మనిషి జీవనాన్ని గడుపుతున్నాడు. ఒకప్పటిలా కాకుండా మూఢనమ్మకాలను వదిలేసి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. ఒక రకంగా మంచి చదువులు చదువుకున్న ప్రతి మనిషి వికాసవంతుడిగా మారిపోతున్నాడు. కానీ ఎందుకో ఒకప్పటి మూఢనమ్మకాలను మాత్రమే కాదు.. బంధాలు బంధుత్వాల మధ్య ఉన్న ప్రేమానురాగాలను కూడా పూర్తిగా మరచిపోతున్నాడు మనిషి.


 ఒకప్పుడు ఆస్తులకు కాదు.. అనుబంధాలకి ఎక్కువ విలువ ఉండేది. ఏకంగా బంధాల కోసం ఆస్తులు వదిలేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ నేటి రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏకంగా ఆస్తుల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నాడు మనిషి. సొంత వారి విషయంలో కూడా కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం మరింత అమానవీయమైనది అని చెప్పాలి.


 పిల్లలను నవ మాసాలు మోసి కనిపించింది ఆ తల్లి. ఇక బతికున్నన్నినాళ్ళు పిల్లల గురించే ఆలోచించింది. పిల్లలకు ఏ కష్టం రాకుండా చూడాలని దేవుడు కోరుకుంటు ఉండేది. కానీ చనిపోయిన తర్వాత ఆ పిల్లలే తనను అనాధ శవంలా వదిలేస్తారు అని ఊహించలేకపోయింది. సూర్యాపేటలో ఏకంగా ఆస్తికోసం తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా నిలిపివేశారు బిడ్డలు. లక్ష్మమ్మ అనే 80 ఏళ్ల వృత్తురాలు అనారోగ్యంతో చనిపోయింది. అయితే ఆమెకు ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె చనిపోయిన తర్వాత 21 లక్షల ఆస్తి 20 తులాల బంగారాన్ని పంచుకునేందుకు ఆమె బిడ్డలు పోటీపడ్డారు  శవం ఇంట్లో ఉండగానే పంచాయితీ కూడా పెట్టారు. అయితే ఈ విషయం రెండు రోజుల వరకు తేలకపోవడంతో చివరికి కన్నతల్లి అంత్యక్రియలు కూడా చేయకుండా రెండు రోజులపాటు అలాగే మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. ఈ ఘటనపై గ్రామస్తులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>