PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cross-votingd7f34d09-539b-4541-b162-d84ab62fbdb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cross-votingd7f34d09-539b-4541-b162-d84ab62fbdb1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా జన్మత్ సర్వే ఫలితాలు వెల్లడి కాగా ఈ సర్వే సంస్థ రాష్ట్రంలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని అయితే కేవలం 93 నుంచి 96 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించే ఛాన్స్ అయితే ఉందని వెల్లడించింది. వైసీపీ సైతం ఎన్నికల తర్వాత వెలువడుతున్న సర్వేల ఫలితాలు తమ పార్టీకే పాజిటివ్ గా ఉండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. cross voting{#}Anakapalle;96;Survey;Parliment;June;Party;TDP;MP;YCPఆ నాలుగు నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్.. ఓటర్ల దెబ్బకు బలయ్యేది ఎవరో?ఆ నాలుగు నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్.. ఓటర్ల దెబ్బకు బలయ్యేది ఎవరో?cross voting{#}Anakapalle;96;Survey;Parliment;June;Party;TDP;MP;YCPSat, 18 May 2024 10:10:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా జన్మత్ సర్వే ఫలితాలు వెల్లడి కాగా ఈ సర్వే సంస్థ రాష్ట్రంలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని అయితే కేవలం 93 నుంచి 96 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించే ఛాన్స్ అయితే ఉందని వెల్లడించింది. వైసీపీ నేతలు  సైతం ఎన్నికల తర్వాత వెలువడుతున్న సర్వేల ఫలితాలు తమ పార్టీకే పాజిటివ్ గా ఉండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
 
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి ఎంపీ అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ తెగ టెన్షన్ పెడుతోంది. చాలా నియోజకవర్గాల్లో రెబల్స్ తమకు వ్యతిరేకంగా పని చేశారని తెలిసి షాకవ్వడం ఎంపీ అభ్యర్థుల వంతవుతోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గాలో ఓటర్ల దెబ్బకు బలయ్యేది ఎవరో అంటూ జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం. క్రాస్ ఓటింగ్ దెబ్బకు కొంతమంది అభ్యర్థులు మెజారిటీ విషయంలో కూడా మాట మార్చేశారని తెలుస్తోంది.
 
క్రాస్ ఓటింగ్ కూటమి కొంప ముంచనుందో వైసీపీ కొంప ముంచనుందో తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. ఎంపీ అభ్యర్థుల సొంత ఊళ్లలో ప్రత్యర్థి పార్టీల నుంచి సైతం ఓట్లు అభిమానంతో పడ్డాయని తెలుస్తోంది. జూన్ 4 కోసం అటు కూటమి నేతలు, ఇటు టీడీపీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఆ సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. క్రాస్ ఓటింగ్ ఎవరికి వరమో ఎవరికి శాపమో తెలియాల్సి ఉంది.
 
లక్ష మెజారిటీ, 2 లక్షల మెజారిటీ వస్తుందని భావించిన వాళ్లు ఇప్పుడు గెలిస్తే చాలని అనుకునే పరిస్థితి ఉంది. చాలా కుటుంబాలలో భర్తల ఓట్లు కూటమికి పడితే భార్యల ఓట్లు వైసీపీకి పడ్డాయని తెలుస్తోంది. మహిళల ఓట్లలో దాదాపుగా 60 శాతం ఫ్యాన్ కు అనుకూలంగా పోల్ అయినట్టు తెలుస్తోంది. టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో మహిళల ఓట్లే కీలకంగా మారనున్నాయని సమాచారం.
 
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>