PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagana768fa1f-47fa-4732-b7da-b2e475b9781f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagana768fa1f-47fa-4732-b7da-b2e475b9781f-415x250-IndiaHerald.jpgజగన్ ధీమాతో ఉన్నారా? ఆయన లెక్క ఆయనకు ఉందా? అందుకే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారా? లేకుంటే పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఆ ప్రయత్నమా? ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధిస్తానని జగన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా వైసీపీ విజయం సంచలనంగా మారుతుంది అని కూడా తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఐ ప్యాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ముందు నుంచి కూడా ఐ ప్యాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తోంది. ఈ టీం ప్రశjagan{#}prasanth;Prashant Kishor;police;Venkatesh;Josh;MP;Jagan;TDP;YCP;Partyఅందరికీ బిగ్‌ షాక్‌ ఇచ్చి.. ఫారిన్‌ ట్రిప్పుకు చెక్కేసిన జగన్‌?అందరికీ బిగ్‌ షాక్‌ ఇచ్చి.. ఫారిన్‌ ట్రిప్పుకు చెక్కేసిన జగన్‌?jagan{#}prasanth;Prashant Kishor;police;Venkatesh;Josh;MP;Jagan;TDP;YCP;PartySat, 18 May 2024 08:08:00 GMTజగన్ ధీమాతో ఉన్నారా? ఆయన లెక్క ఆయనకు ఉందా? అందుకే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారా? లేకుంటే పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఆ ప్రయత్నమా? ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధిస్తానని జగన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా వైసీపీ విజయం సంచలనంగా మారుతుంది అని కూడా తేల్చి చెప్పారు.


తాజాగా ఆయన ఐ ప్యాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ముందు నుంచి కూడా ఐ ప్యాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తోంది. ఈ టీం ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో ఏర్పడింది. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ తన వ్యూహకర్త పదవిని వదిలిపెట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి సొంత రాష్ట్రం బిహార్ వెళ్లిపోయారు.


ఇక ఆయన జగన్ ఓడిపోతారని చెప్పడం…అత్యధిక పోలింగ్ నమోదు కావడం తమకే లాభం చేకూరుస్తుందని టీడీపీ నేతలు చెప్పడంతో వైసీపీ నాయకులు డీలా పడ్డారు. మరోవైపు ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత, పోలీసులు ఈ ఎన్నికల్లో కూటమికి సహకరించడం వంటివి చూసి ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో జగన్ హాట్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 151 ఎమ్మెల్లే, 22 ఎంపీ సీట్లకు మించి ఈ సారి వస్తాయని సంచలన ప్రకటన చేశారు.


అయితే వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు జగన్ ఈ ఎత్తుగడను ఎంచుకున్నట్లు కూటమి నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ ఓటమి పాలవుతుందని వస్తున్న విశ్లేషణలు, ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే జగన్ ఈ ప్రకటన చేశారని కొందరు అనుమానిస్తున్నారు. మరికొందరు గత ఎన్నికల ముందు కూడా ఇదే ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తామని ప్రకటన చేశారని.. ఇప్పుడు కూడా గెలుపుపై ఓ అవగాహనకు వచ్చిన తర్వాతే బయటకు వచ్చి మాట్లాడారని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద జగన్ ప్రకటనతో ఆ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి జగన్ ది నమ్మకమా, అతి శయమా అనేది రెండు వారాల్లో తేలిపోనుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>