EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan237bf946-e0c4-490a-82dc-1c1ba60b0811-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan237bf946-e0c4-490a-82dc-1c1ba60b0811-415x250-IndiaHerald.jpgఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాక ముందే రకరకాల చర్చలు మొదలయ్యాయి. గతంలో ఎప్పుడూ కూడా గెలుపుపై రెండు పార్టీల నేతలు ఈ రేంజ్ లో ధీమాగా లేరు. తమకే సానుకూల పవనాలు వీస్తున్నాయని ఇటు కూటమి నేతలు, అటు వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు మంత్రి బొత్స సత్య నారాయణ సీఎంగా రెండో సారి జగన్ ప్రమాణ స్వీకారం చేసే తేదీని, వేదికని కూడా ప్రకటించేశారు కూడా. ఇదిలా ఉండగా.. సీఎం జగన్ మరోసారి అధికారం చేపడితే ఈ పనులపై దృష్టి సారించాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. అవేంటంటే.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇjagan{#}Sugar;satya;Manam;sree;Minister;House;Assembly;Jagan;YCP;CMజగన్‌ మళ్లీ సీఎం కాగానే అర్జంటుగా చేయాల్సిన పని ఇదే?జగన్‌ మళ్లీ సీఎం కాగానే అర్జంటుగా చేయాల్సిన పని ఇదే?jagan{#}Sugar;satya;Manam;sree;Minister;House;Assembly;Jagan;YCP;CMSat, 18 May 2024 23:00:00 GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాక ముందే రకరకాల చర్చలు మొదలయ్యాయి.  గతంలో ఎప్పుడూ కూడా గెలుపుపై రెండు పార్టీల నేతలు ఈ రేంజ్ లో ధీమాగా లేరు.  తమకే సానుకూల పవనాలు వీస్తున్నాయని ఇటు కూటమి నేతలు, అటు వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు మంత్రి బొత్స సత్య నారాయణ సీఎంగా రెండో సారి జగన్ ప్రమాణ స్వీకారం చేసే తేదీని, వేదికని కూడా ప్రకటించేశారు కూడా.


ఇదిలా ఉండగా.. సీఎం జగన్ మరోసారి అధికారం చేపడితే ఈ పనులపై దృష్టి సారించాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. అవేంటంటే.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లన్నీ పూర్తి చేయించాలి. రెండేళ్లలో పూర్తి చేసి అక్కడ మౌలిక వసతుల కల్పనకు కృషి చేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. ఇలా చేస్తే వారంతా జీవితాంతం జగన్ ని గుండెల్లో పెట్టుకొని ఓటేస్తారు.


మరికొంత మందికి న్యాయపరమైన చిక్కులతో ఇళ్ల పట్టాలు రాలేదు. వీటికి పరిష్కారం చూపి.. మధ్య తరగతి వారికి ఇస్తాను అని చెప్పిన పట్టాలను పంపిణీ చేయాలి. వీలైతే వారికి ఇల్లు నిర్మించుకునేందుకు లోన్లు లాంటివి అందజేయాలి. ఎలాగూ ఇస్తాను అన్న సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే గత ఐదేళ్లలో మనం చూశాం కాబట్టి.


ఇక ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఆరోగ్య శ్రీ  పరిమితిని రూ.25లక్షలకు పెంచుతాం అని జగన్ ప్రకటించారు. పరిమితి పెంచడం కాదు. వాటికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే డయాబెటిస్ పేషంట్లకు ఇన్ పేషేంట్ గా చేరితేనే ఉచిత వైద్యం అందుతుంది. దాని కంటే ముందు నిర్ధారణ టెస్టులు, తదితర స్కానింగ్ లకు మధ్య తరగతి వారు కూడా భరించలేనంతగా రూ.వేల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి పరిష్కారం చూపడంతో పాటు పాటు కొనసాగిస్తామని చెప్పిన పథకాలను అమలు చేయాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>