SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl51343825-a65e-40dd-a1a6-44c72f418f76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl51343825-a65e-40dd-a1a6-44c72f418f76-415x250-IndiaHerald.jpg(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ , బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు కూడా అత్యంత కీలకమైన మ్యాచ్. ఇప్పటికే ఈ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ ఈ మూడు జట్లు కూడా పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాలలో ఉండి ప్లే ఆప్స్ కి చేరిపోయాయి. ఇక ప్లే ఆప్స్ కి వెళ్లడానికి ఒకే ఒక్క స్థానం మాత్రమే మిగిలి ఉంది. ఆ ఒక్క స్థానం కోసమే ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ Ipl{#}Rajasthan;Chennai;Royal Challengers;Varsham;Hyderabad;Yevaru;Indianఈరోజు ఐపీఎల్ లో అసలు సిసలు పోరు... ప్లే ఆప్స్ కి వెళ్ళేది ఎవరు..?ఈరోజు ఐపీఎల్ లో అసలు సిసలు పోరు... ప్లే ఆప్స్ కి వెళ్ళేది ఎవరు..?Ipl{#}Rajasthan;Chennai;Royal Challengers;Varsham;Hyderabad;Yevaru;IndianSat, 18 May 2024 15:03:00 GMT(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ , బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు కూడా అత్యంత కీలకమైన మ్యాచ్. ఇప్పటికే ఈ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ , సన్రైజర్స్ హైదరాబాద్ ఈ మూడు జట్లు కూడా పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాలలో ఉండి ప్లే ఆప్స్ కి చేరిపోయాయి. ఇక ప్లే ఆప్స్ కి వెళ్లడానికి ఒకే ఒక్క స్థానం మాత్రమే మిగిలి ఉంది.

ఆ ఒక్క స్థానం కోసమే ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ మరియు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వారే ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశం చాలా వరకు ఉంది. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో వారు కనుక ఈ మ్యాచ్ గెలిచినట్లయితే ప్లే ఆప్స్ కి వెళ్ళిపోతారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ కి ఉన్నంత అనుకూలత ప్లే ఆప్స్ కి వెళ్లడానికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కి లేదు.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ , చెన్నై సూపర్ కింగ్స్ పై గెలవడం మాత్రమే కాకుండా మంచి రన్ రెట్ ను కూడా ఈ మ్యాచ్ ద్వారా పెంచుకోవాల్సి ఉంది. అలా ఈ మ్యాచ్ ను మంచి రన్ రేట్ తో గెలిస్తేనే బెంగుళూరు ఈ సీజన్ లో ప్లే ఆప్స్ కి వెళుతుంది. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారే ప్లే ఆప్స్ కి వెళ్లడానికి అవకాశం ఉండడంతో ఈ మ్యాచ్ చూడడానికి చెన్నై సూపర్ కింగ్స్ , బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ఐపిఎల్ అభిమానులు కూడా ఈ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఈ రోజు మ్యాచ్ కి వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ఈ రోజు మ్యాచ్ కి వర్షం ఏమైనా అంతరాయం కలిగిస్తుందేమో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>