PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/two-backs-in-the-same-party-in-sattenapally-is-this-the-cross-voting926c3fd0-5026-4e8f-a0a1-48081b7de0e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/two-backs-in-the-same-party-in-sattenapally-is-this-the-cross-voting926c3fd0-5026-4e8f-a0a1-48081b7de0e4-415x250-IndiaHerald.jpg- అసెంబ్లీకి ఫ్యాన్‌... పార్ల‌మెంటు సైకిల్‌కు వేయ‌మ‌న్న అంబ‌టి గ్యాంగ్‌ - రివ‌ర్స్‌లో అసెంబ్లీకి క‌న్నాకు... పార్ల‌మెంటుకు అనిల్‌కు వేసిన కేడ‌ర్‌ ( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ ) ఒకే పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలు ప్రచారంలోనే ఎమ్మెల్యే ఓటు మాకు వేసి.. ఎంపీ ఓటు మీకు నచ్చిన వారికి వేసుకోండి అని.. లేదా ఎమ్మెల్యే ఓటు మనకు వేసి ఎంపీ ఓటు అటు వేయమని, లేదా ఎంపీ ఓటు మనకు వేసి.. ఎమ్మెల్యే ఓటు అటు వేయమని ప్రచారం చేయటం చూస్తూ ఉంటాం. ఇక్కడ పార్టీలు వేరు అయినా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నవారుAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; Anil Kumar Yadav; ambati rambabu; sri krishnadevaraya{#}Sri Krishna;Aqua;contract;Sattenapalle;Kanna Lakshminarayana;narasaraopet;P Anil Kumar Yadav;Cycle;Guntur;Kumaar;Minister;Assembly;MLA;TDP;MP;India;YCPస‌త్తెన‌ప‌ల్లిలో ఒకే పార్టీలో రెండు వెన్నుపోట్లు... ఇదే తిర క్రాస్ ఓటింగ్‌..?స‌త్తెన‌ప‌ల్లిలో ఒకే పార్టీలో రెండు వెన్నుపోట్లు... ఇదే తిర క్రాస్ ఓటింగ్‌..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; Anil Kumar Yadav; ambati rambabu; sri krishnadevaraya{#}Sri Krishna;Aqua;contract;Sattenapalle;Kanna Lakshminarayana;narasaraopet;P Anil Kumar Yadav;Cycle;Guntur;Kumaar;Minister;Assembly;MLA;TDP;MP;India;YCPSat, 18 May 2024 09:09:04 GMT- అసెంబ్లీకి ఫ్యాన్‌... పార్ల‌మెంటు సైకిల్‌కు వేయ‌మ‌న్న అంబ‌టి గ్యాంగ్‌
- రివ‌ర్స్‌లో అసెంబ్లీకి క‌న్నాకు... పార్ల‌మెంటుకు అనిల్‌కు వేసిన కేడ‌ర్‌

( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )

ఒకే పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలు ప్రచారంలోనే ఎమ్మెల్యే ఓటు మాకు వేసి.. ఎంపీ ఓటు మీకు నచ్చిన వారికి వేసుకోండి అని.. లేదా ఎమ్మెల్యే ఓటు మనకు వేసి ఎంపీ ఓటు అటు వేయమని, లేదా ఎంపీ ఓటు మనకు వేసి.. ఎమ్మెల్యే ఓటు అటు వేయమని ప్రచారం చేయటం చూస్తూ ఉంటాం. ఇక్కడ పార్టీలు వేరు అయినా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నవారు ఒకే కులానికి చెందినవారు అయితే ఈ తరహా ప్రచారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. లేదా పార్టీలు వేరు అయినా వారి మధ్య అంతర్గతంగా ఒప్పందం ఉంటే ఇలాంటి ప్రచారాలు కామన్ గా నడుస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి ఇలాంటి ప్రచారాలే రివర్స్ అవుతుంటాయి.


తాజా అసెంబ్లీ ఎన్నికలలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోను ఒకే పార్టీలో రెండు వెన్నుపోట్లు జరిగాయని... ఇది తిర‌క్రాస్ ఓటింగ్‌గా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  సత్తెనపల్లిలో వైసీపీ నుంచి జల వనరుల మంత్రి అంబటి రాంబాబు పోటీలో ఉంటే.. టీడీపీ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేశారు. ఇక నరసరావుపేట పార్లమెంటుకు మాజీ జల వనరుల మంత్రి కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే టీడీపీ నుంచి గత ఎన్నికలలో వైసీపీ ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయులు పోటీ చేస్తున్నారు. ఇక సత్తెనపల్లిలో చాలామంది వైసీపీ కార్యకర్తలు అసెంబ్లీకి అంబటికి ఓటు వేసి.. ఎంపీకి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయులకు ఓటు వేయాలని ప్రచారం చేశారు అన్న గుసగుసలు పోలింగ్ సమయంలో వినిపించాయి.


అయితే కొందరు దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీకి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ కు ఓటు వేసి.. పార్లమెంటుకు వచ్చేసరికి వైసీపీ నుంచి పోటీ చేసిన కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ కు ఓట్లు వేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా అంబటి వర్గం తమకు.. ఎంపీ లావు శ్రీకృష్ణతో ఉన్న అనుబంధం నేపథ్యంలో అసెంబ్లీకి ఫ్యాన్ కు.. పార్లమెంటుకు సైకిల్ కు ఓట్లు వేయించినట్లు కూడా ప్రచారం గట్టిగా నడుస్తోంది. మరో ప్రచారం ప్రకారం గత ఐదేళ్లలో ఇటు మంత్రిగా.. అటు ఎంపీగా ఉన్న అంబటి - లావు శ్రీకృష్ణ ఒకే పార్టీలో ఉన్నారు.. వారి మధ్య ఎంతో సఖ్యత ఉంది. అందుకే అంబటి కూడా అసెంబ్లీకి.. తనకు పార్లమెంటుకు.. లావుకు ఓట్లు వేయమని చెప్పిన మాట కూడా గుప్పుమంటోంది. మరి ఇందులో వాస్తవ, అవాస్తవాలు ఎలా ఉన్నా ? సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ తిరక్రాస్ ఓటింగ్ ఇప్పుడు బాగా చర్చ‌కి వస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>