Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-fansku-strong-counter-echina-renu602fe2dd-5e6b-4055-91b6-98f4400f4872-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-fansku-strong-counter-echina-renu602fe2dd-5e6b-4055-91b6-98f4400f4872-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక ఏవో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య బాధ్యత తీసుకుంది. అయితే రేణు దేశాయ్ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. అలాగే తన కూతురు, కొడుకు ఫొటోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ ఆమె వదిన అంటూ పలు కామెంట్లు పెడుతుంటారు.వాటికి రేణు దేశాయ్ కూsocialstars lifestyle{#}renu desai;marriage;Annayyaపవన్ ఫ్యాన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేణు దేశాయ్..!!పవన్ ఫ్యాన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రేణు దేశాయ్..!!socialstars lifestyle{#}renu desai;marriage;AnnayyaSat, 18 May 2024 19:15:00 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక ఏవో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య బాధ్యత తీసుకుంది. అయితే రేణు దేశాయ్ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. అలాగే తన కూతురు, కొడుకు ఫొటోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ ఆమె వదిన అంటూ పలు కామెంట్లు పెడుతుంటారు.వాటికి రేణు దేశాయ్ కూడా గట్టిగానే స్పందించి పోస్టులు పెడుతుంది. ఇప్పటికే అకీరా నందన్‌ను మా అన్న కొడుకు అన్నప్పుడల్లా.. రేణు ఫైర్ అయింది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచి ఆమె యానిమల్స్‌కు, చిన్నారులకు సహాయం చేస్తుంది. ఈ క్రమంలో డబ్బులు సరిపోకపోవడంతో ఫాలోవర్స్‌ను అడుగుతుంది. అయితే ఎవరో హెల్త్ చేశారని తెలుపుతూ.. రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఓ నెటిజన్ వాళ్లు కూడా మా పవన్ అన్నయ్య లాగా గొప్ప మనసు ఉన్నవారు అని కామెంట్ పెట్టాడు. ఇక ఆ పోస్ట్ చూసిన రేణు దేశాయ్ స్ట్రాంగ్‌గానే స్పందించి ఫ్యాన్స్‌కు గట్టి షాకిచ్చింది.

''కొన్ని సంవత్సరాల నుంచి నేను నా సొంతంగా ఏదైనా చేస్తే అది వెంటనే క్రెడిట్ అవుతుంది. లేదా నా మాజీ భర్తతో పోల్చబడుతుంది. నాకు వ్యక్తిగతంగా అతనితో ఎలాంటి సమస్య లేదు. కానీ దయచేసి నా ఇన్‌స్టాగ్రామ్ నాది మాత్రమేనని అతని అనచరులను అభ్యర్థిస్తున్నాను. మీలో కొంతమంది నేను చేసే ప్రతి పోస్ట్‌ను వందల కొద్ది నా మాజీ భర్తతో ఎందుకు పోల్చాలి? నేను ఇప్పటికీ వందల కొద్ది అకౌంట్స్‌ను డిలీట్ చేసి బ్లాక్ చేసి ఉంటాను.నేను ఒక మనిషిగా 10 సంవత్సరాల వయస్సు నుండి జంతువులకు సహాయం చేస్తున్నాను. దీనికి నా మాజీ భర్తతో ఎటువంటి సంబంధం లేదు. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను కాబట్టి నేను అతనిని ఎలా ఇష్టపడుతున్నాను అని నా ప్రతి ఒక్క పోస్ట్‌పై మీరు మాట్లాడటం మానేయమని హృదయసపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను నేను చేసే జంతువులను పట్టించుకోడు లేదా ప్రేమించడు'' అని వరుస పోస్టులు పెట్టింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>