Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea699fbfc-46b2-4871-9b84-f77a237bcf97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea699fbfc-46b2-4871-9b84-f77a237bcf97-415x250-IndiaHerald.jpgరజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లింగ. దర్శకుడు కే ఎస్ రవికుమార్ తెరకెక్కించిన లింగ చిత్రం 2014లో విడుదలైంది. అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు.ఈ మూవీలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన సివిల్ ఇంజనీర్ గా కనిపిస్తారు. ఈ పాత్రకు భార్యగా కనిపిస్తుంది సోనాక్షి సిన్హా. కాగా సోనాక్షి సిన్హా పక్కన ఉండే అమ్మాయి పాత్రలో కనిపించింది ఇప్పటి హీరోయిన్. అప్పుడు సపోర్టింగ్ రోల్ చేసిన ఆమె ఇప్పుడు సోలో హీరోయిన్ గా నటిస్తుంది.లింగ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన అsocialstars lifestyle{#}anoushka;Ram Gopal Varma;Sonakshi Sinha;pradeep;Bigil;Foot Ball;engineer;silver screen;K S Ravikumar;Episode;amrutha;ram pothineni;Girl;Blockbuster hit;Chitram;Darsakudu;Rajani kanth;Joseph Vijay;Heroine;Makar Sakranti;teja;Tamil;Hero;Cinema;Telugu;Director;Redఅప్పుడు సపోర్టింగ్ రోల్ గా..ఇప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా...!!అప్పుడు సపోర్టింగ్ రోల్ గా..ఇప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా...!!socialstars lifestyle{#}anoushka;Ram Gopal Varma;Sonakshi Sinha;pradeep;Bigil;Foot Ball;engineer;silver screen;K S Ravikumar;Episode;amrutha;ram pothineni;Girl;Blockbuster hit;Chitram;Darsakudu;Rajani kanth;Joseph Vijay;Heroine;Makar Sakranti;teja;Tamil;Hero;Cinema;Telugu;Director;RedFri, 17 May 2024 23:00:00 GMTరజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లింగ. దర్శకుడు కే ఎస్ రవికుమార్ తెరకెక్కించిన లింగ చిత్రం 2014లో విడుదలైంది. అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు.ఈ మూవీలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన సివిల్ ఇంజనీర్ గా కనిపిస్తారు. ఈ పాత్రకు భార్యగా కనిపిస్తుంది సోనాక్షి సిన్హా. కాగా సోనాక్షి సిన్హా పక్కన ఉండే అమ్మాయి పాత్రలో కనిపించింది ఇప్పటి హీరోయిన్. అప్పుడు సపోర్టింగ్ రోల్ చేసిన ఆమె ఇప్పుడు సోలో హీరోయిన్ గా నటిస్తుంది.లింగ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన అమ్మడు ఎవరో కాదు. అమృత అయ్యర్. లింగా ఆమెకు మూడో చిత్రం. 2012లో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కాగా... ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రలు చేస్తూ వచ్చింది. విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి లో సైతం అన్ క్రెడిటెడ్ రోల్ చేసింది అమృత. ఇక హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం పడైవీరన్. ఈ తమిళ చిత్రంలో విజయ్ ఏసుదాస్ హీరోగా నటించాడు.

బిగిల్ మూవీ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. లీడ్ హీరోయిన్ కాకపోయినా... ఫుట్ బాల్ ప్లేయర్ గా కీలక రోల్ చేసింది. తెలుగులో ఈ చిత్రం విజిల్ గా విడుదలైంది. బిగిల్ విజయం సాధించడంతో ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ పెరిగాయి. రెడ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ తమిళ్ రీమేక్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ ఆమెకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతూ రూపొందించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక అమృత అయ్యర్ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హనుమాన్. 2024 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన హనుమాన్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్. తేజ సజ్జా సూపర్ హీరో రోల్ చేశాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఒకప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేని సపోర్టింగ్ రోల్స్ చేసిన అమృత అయ్యర్ భారీ బ్లాక్ బస్టర్ హీరోయిన్ కావడం ఊహించని పరిణామం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>