Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/divorce-f7374b67-be4f-4806-a5e9-d3df621b2bef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/divorce-f7374b67-be4f-4806-a5e9-d3df621b2bef-415x250-IndiaHerald.jpgసాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి కామన్. ఇలా చిన్నచిన్న గొడవలు వచ్చినప్పుడు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది అని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న చిన్న చిన్న వివాదాలు చివరికి విడాకుల వరకు దారి తీస్తున్నాయి. ఇంకొన్ని ఘటనలలో ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంత దారుణమైన ఘటనలకు కూడా కారణమవుతున్నాయి అని చెప్పాలి. నేటి రోజుల్లో ఇలా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్న యువతి యువకులు ఇDivorce {#}Uttar Pradesh;police;court;Husband;Wifeకుర్ కురే కొనివ్వలేదని.. భార్య విడాకులు?కుర్ కురే కొనివ్వలేదని.. భార్య విడాకులు?Divorce {#}Uttar Pradesh;police;court;Husband;WifeFri, 17 May 2024 08:15:00 GMTసాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి కామన్. ఇలా చిన్నచిన్న గొడవలు వచ్చినప్పుడు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది అని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న చిన్న చిన్న వివాదాలు చివరికి విడాకుల వరకు దారి తీస్తున్నాయి. ఇంకొన్ని ఘటనలలో ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంత దారుణమైన ఘటనలకు కూడా కారణమవుతున్నాయి అని చెప్పాలి. నేటి రోజుల్లో ఇలా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్న యువతి యువకులు ఇద్దరికీ కూడా విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణంగానే మారిపోయింది.


 ఏకంగా భార్య నచ్చిన కూర వండలేదని కొంతమంది.. భర్త తరచు తాగి వస్తున్నాడని ఇంకొంతమంది  భర్త ఎక్కువ మంచివాడు అని ఇంకొంత మంది ఇలా చిత్ర విచిత్రమైన కారణాలతో ఎంతోమంది విడాకులు తీసుకొని వేరుపడటానికి ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఇలాంటి ఒక విచిత్రమైన కారణంతోనే ఏకంగా భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు. విడాకులు అంటే ఏకంగా దాంపత్య బంధానికి స్వస్తి పలికి ఎవరి జీవితం వారు చూసుకోవడమే. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటే ఏదో పెద్ద కారణమే కావాలి. కానీ ఇక్కడ విడాకులు తీసుకోవడానికి కారణం తెలిస్తే మాత్రం నోరేళ్లబెడతారు.


 భార్యాభర్తల మధ్య కురుకురే విషయంలో ఏర్పడిన వివాదం చివరికి కోర్టు వరకు వెళ్ళింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది. ఐదు రూపాయల కుర్ కురే వల్ల వచ్చిన గొడవ విడాకుల వరకు వెళ్ళింది  తనకు కుర్ కురే ప్యాకెట్ కొనివ్వలేదని భర్తతో గొడవ పడింది వివాహిత. చివరికి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమెకు కుర్కురే ప్యాకెట్ తింటే కానీ నిద్ర పట్టదట. ఇక భర్త కూడా భార్యను అర్థం చేసుకొని రోజు కుర్కురే ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చేవాడట. ఇటీవలే పని ఒత్తిడితోనో లేదంటే ఆదమరిచో ఇక కురుకురే ప్యాకెట్ తీసుకోలేదు. దీంతో సదరు మహిళా భర్తతో గొడవ పడింది. అతనిపై అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. తన కోరికలు తీర్చని వ్యక్తితో ఉండే ప్రసక్తే లేదు అంటూ కోర్టు మెట్లు ఎక్కి విడాకులు ఇవ్వాలంటూ కోరింది. దీంతో కలగజేసుకున్న పోలీసులు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చచెప్పారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>