MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shirishe532c73a-8b07-4ca3-ace9-3769c6ef34ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shirishe532c73a-8b07-4ca3-ace9-3769c6ef34ac-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు అల్లు శిరీష్ ప్రస్తుతం బడ్డీ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ నటుడు ఆర్య హీరో గా రూపొందిన టెడ్డి సినిమాకి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. శాన్ అంటోన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి చాలా రోజుల క్రితమే ఓ చిన్న వీడియోను మేకర్స్ విడుదల చేయగా అది బాగుండడంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ వీడియో విడుదల అయిన తర్వాత ఈ చిత్ర బృందం వారు సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తూ ఉండడంతో ఈ మూవీ కి సంబంధShirish{#}allu sirish;Remake;Srirasthu Subhamasthu;NET FLIX;arya;Aryaa;Yuva;Hero;Cinema;News"బడ్డీ" డిజిటల్ పార్ట్నర్ లాక్..!"బడ్డీ" డిజిటల్ పార్ట్నర్ లాక్..!Shirish{#}allu sirish;Remake;Srirasthu Subhamasthu;NET FLIX;arya;Aryaa;Yuva;Hero;Cinema;NewsThu, 16 May 2024 19:55:08 GMTటాలీవుడ్ యువ నటుడు అల్లు శిరీష్ ప్రస్తుతం బడ్డీ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ నటుడు ఆర్య హీరో గా రూపొందిన టెడ్డి సినిమాకి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. శాన్ అంటోన్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి చాలా రోజుల క్రితమే ఓ చిన్న వీడియోను మేకర్స్ విడుదల చేయగా అది బాగుండడంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ వీడియో విడుదల అయిన తర్వాత ఈ చిత్ర బృందం వారు సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తూ ఉండడంతో ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లు బయటకు రాలేదు.

ఇక తాజాగా ఈ మూవీ బృందం వారు ఆ పిల్ల కనులేతో అని సాగే మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదల తో మళ్లీ ఈ సినిమాపై వార్తలు మొదలు అయ్యాయి. ఇకపోతే చిత్రీకరణ దశలో ఉండగానే ఈ మూవీ యొక్క ఓ టీ టీ పార్ట్నర్ లాక్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని వారాల ధియేటర్ రన్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టీ  టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మంచి కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకున్న శిరీష్ ఆ మూవీ తర్వాత పలు సినిమాలలో నటించిన వాటి ద్వారా పెద్ద విజయాలను అందుకోలేదు. ఆఖరుగా ఈయన ఊర్వశివో రాక్షసివో సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>