DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modib18f6294-8460-4401-ac9d-f224f6322947-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modib18f6294-8460-4401-ac9d-f224f6322947-415x250-IndiaHerald.jpgపాలస్తీనా అనేది తీవ్రవాద దేశం. హమాస్ అనే తీవ్రవాదులను పెంచి పోషిస్తూ.. ఇతర జాతులేవీ బతకొద్దు అనే ఉద్దేశంతో వారిపై దాడులు చేస్తూ ఉంటుంది. పొరుగు దేశమైన ఇజ్రాయెల్ లో యూదులను అంతం చేసి తమ ముస్లి దేశంలో కలుపుకోవాలని హమాస్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే దాడులు నిర్వహించి.. రక్తపాతం సృష్టించిన విషయం మనందరకీ తెలిసిందే. దీని పరిణామమే ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు. దీనంతటకీ కారణం ఎవరు అంటే హమాస్ తీవ్రవాదులు. నాడు ముస్లిం ఓట్లతో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పాలస్తీనాను ఓ దేశంగా గుర్తించింmodi{#}abbas;Israel;Narendra Modi;Prime Minister;Qualification;Manam;Yevaru;politics;Congress;India;Assembly;Bharatiya Janata Partyఇంట్రస్టింగ్‌: ఆ ముస్లిం దేశానికి అనుకూలంగా ఓటేసిన మోదీ?ఇంట్రస్టింగ్‌: ఆ ముస్లిం దేశానికి అనుకూలంగా ఓటేసిన మోదీ?modi{#}abbas;Israel;Narendra Modi;Prime Minister;Qualification;Manam;Yevaru;politics;Congress;India;Assembly;Bharatiya Janata PartyThu, 16 May 2024 08:00:00 GMTపాలస్తీనా అనేది తీవ్రవాద దేశం.  హమాస్ అనే తీవ్రవాదులను పెంచి పోషిస్తూ.. ఇతర జాతులేవీ బతకొద్దు అనే ఉద్దేశంతో వారిపై దాడులు  చేస్తూ ఉంటుంది. పొరుగు దేశమైన ఇజ్రాయెల్ లో యూదులను అంతం చేసి తమ ముస్లి దేశంలో కలుపుకోవాలని హమాస్ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే దాడులు నిర్వహించి.. రక్తపాతం సృష్టించిన విషయం మనందరకీ తెలిసిందే. దీని పరిణామమే ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు.


దీనంతటకీ కారణం ఎవరు అంటే హమాస్ తీవ్రవాదులు. నాడు ముస్లిం ఓట్లతో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పాలస్తీనాను ఓ దేశంగా గుర్తించింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది పక్కన పెడితే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణలకు కారణమైన పాలస్తీనాను ఐరాసలో సభ్య దేశంగా చేయాలని తీర్మానం పెడితే దీనికి అనుకూలంగా భారత్ ఓటు వేయడం గమనార్హం.


పాలస్తీనాను సభ్యదేశంగా చేయాలని ప్రతిపాదనకు ఐరాస అసెంబ్లీలో భారత్ మద్దతు తెలిపింది. పాలస్తీనాకు మద్దతుగా ఓటేసింది. ఐరాసలో అరబ్ దేశాల సమూహారం సమర్పించిన తీర్మానంలో పాలస్తీనా సభ్యత్వానికి పూర్తి అర్హత ఉందని పేర్కొంది. కాబట్టి దానిని సభ్యుడిగా చేర్చాలని జనరల్ అసెంబ్లీ మరోసారి సిషార్సు చేసింది. దీనిపై భద్రతా మండలి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 193 మంది సభ్యులతో కూడిన యూఎన్ జనరల్ అసెంబ్లీలో మొత్తం 143  మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. తొమ్మిది మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 25 మంది పాల్గొనలేదు.


పాలస్లీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్  అబ్బాస్ తీర్మానం ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు తాము వ్యతిరేకం అని చెప్పే ప్రధాని మోదీ పాలస్తీనాకు అనుకూలంగా ఓటు వేయడం ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. బీజేపీ కూడా ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది. అంటే పరోక్షంగా మనం కూడా ఉగ్రవాదానికి మద్దతు తెలిపినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలను మోదీ కూడా మొదలు పెట్టారని పలువురు విమర్శిస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>