PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/how-much-did-the-jana-sena-get-in-the-25-percent-kapula-voting4746ab87-66f7-4f48-972d-fffaac072a81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/how-much-did-the-jana-sena-get-in-the-25-percent-kapula-voting4746ab87-66f7-4f48-972d-fffaac072a81-415x250-IndiaHerald.jpg- కాపు యూత్ అంతా ప‌వ‌న్ వెంటే... 30 ఏళ్లు దాటిన వారిలో మాత్రం ఆలోచ‌న‌ - ప‌వ‌న్ రాజ్యాధికారం సెంటిమెంట్‌తో కూట‌మికి మొగ్గిన కాపులు ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) రాష్ట్రంలో కాపుల ఓటు బ్యాంకును కీల‌కంగా చేసుకున్నా.. చేసుకోక‌పోయినా.. జ‌న‌సేన‌కు మాత్రం కాపుల ఓటు బ్యాంకు అత్యంత కీల‌కం. రాష్ట్రంలో వీరి ఓటు బ్యాంకు 25శాతం పైగానే ఉంద‌ని అంచ‌నా. పోనీ.. 20 శాత‌మే ఉంద‌ని అనుకున్నా.. దీనిలో మెజారిటీ ఓటు బ్యాంకు ఎటు ప‌డుతుంది? అనేది ప్ర‌శ్న‌. ఎందుకం టే.. కాపు సామాజిక వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేయ‌డంతోపాటు.. ఆ AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena; 25 percent; naidu{#}youth;India25 శాతం కాపుల ఓటింగ్‌లో జ‌న‌సేన తెచ్చుకున్న‌దెంత‌..?25 శాతం కాపుల ఓటింగ్‌లో జ‌న‌సేన తెచ్చుకున్న‌దెంత‌..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena; 25 percent; naidu{#}youth;IndiaThu, 16 May 2024 08:14:33 GMT- ప‌వ‌న్ రాజ్యాధికారం సెంటిమెంట్‌తో కూట‌మికి మొగ్గిన కాపులు

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

రాష్ట్రంలో కాపుల ఓటు బ్యాంకును కీల‌కంగా చేసుకున్నా.. చేసుకోక‌పోయినా.. జ‌న‌సేన‌కు మాత్రం కాపుల ఓటు బ్యాంకు అత్యంత కీల‌కం. రాష్ట్రంలో వీరి ఓటు బ్యాంకు 25శాతం పైగానే ఉంద‌ని అంచ‌నా. పోనీ.. 20 శాత‌మే ఉంద‌ని అనుకున్నా.. దీనిలో మెజారిటీ ఓటు బ్యాంకు ఎటు ప‌డుతుంది? అనేది ప్ర‌శ్న‌. ఎందుకం టే.. కాపు సామాజిక వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేయ‌డంతోపాటు.. ఆ వ‌ర్గం ఓటు బ్యాంకును సొంతం చేసుకోవాల న్న‌ది జ‌న‌సేన మాట‌.


పైకి చెప్ప‌క‌పోయినా.. ప‌వ‌న్ ఆచ‌రించింది.. అనుస‌రించింది కూడా.. కాపు ఫార్ములానే. తిరుప‌తిలో బ‌లిజ సామాజిక వ‌ర్గానికి టికెట్ ఇచ్చినా.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. ఇదే ఫార్ములా అమ‌లు చేసినా.. ఆయ‌న వ్యూహం కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని ట‌ర్న్ చేయ‌డ‌మే.  అంతేకాదు.. కాపుల‌కు రాజ్యాదికారం అనే మాట‌ను కూడా ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ వినిపించాడు. అలానే.. కాపు యువ‌త బ‌లి కావాల్సిందేనా అని ప్ర‌శ్నించ‌డం ద్వారా.. ఆ వ‌ర్గాన్ని కూడా ప్ర‌భావితం చేశారు.


ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు ముగిశాయి. మ‌రి కాపు ఓట‌ర్లు ఎటు ఉన్నారు.? అనేది ప్రశ్న‌. ఈ త‌ర‌హా ఓటు బ్యాంకు.. విష‌యంలో రెండు కోణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి నిల‌క‌డ‌గా ఆలోచించి ఓటేసే పెద్ద‌లు, వృద్ధు లు.. 50 ఏళ్ల‌పైబ‌డిన వారు. ఇక‌, 30 - 40 ఏళ్ల వారు.. అటు ఇటుగా ఆలోచించి.. ఒక‌ర‌కంగా డ్రా తీసి ఓటేసి న‌ట్టు తెలుస్తోంది. ఇక 30 ఏళ్ల లోపు వారు మాత్రం.. ప‌వ‌న్‌కు అనుకూలంగానే ఓటేశారు. వీరికి అక్క‌డ పోటీలో ఉన్న నాయ‌కుడితో ఎలాంటి సంబంధం లేదు.


ప‌వ‌న్ కోసం.. తాము ఓటేస్తున్నాం.. అనే విధంగా ఈ యువ‌త పోటెత్తారు. దీనిని బ‌ట్టి 25 శాతం లేదా 20 శాతం ఓటు బ్యాంకు ఉన్న కాపుల్లో జ‌న‌సేన రాబ‌ట్టుకున్న‌ది ఎంత? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఉన్న అంచనాల మేర‌కు ఈ ఓటు బ్యాంకులో 50-60 శాతం మాత్ర‌మే ఆయ‌న‌కు ప‌డింద‌ని అంటున్నారు. మిగిలిన ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ప‌డింద‌నే చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఇది ప‌వ‌న్‌కు మేలు చేయ‌క‌తప్ప‌ద‌నే అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి. ఏదేమైనా కాపులు మాత్రం ప్ర‌భావం చూపించార‌నేది వాస్త‌వం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>