PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/amith-shah-bjp-modi-article-370-pok-nda327aeb4a-618b-49c1-9cf9-026d49ba8b17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/amith-shah-bjp-modi-article-370-pok-nda327aeb4a-618b-49c1-9cf9-026d49ba8b17-415x250-IndiaHerald.jpgదేశంలోని అతిపెద్ద జాతీయ పార్టీలలో బీజేపీ కూడా ఒకటి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇదే తరుణంలో బీజేపీ మళ్లీ పూర్తిస్థాయిలో అధికారంలోకి వస్తే వారు తీసుకునే నిర్ణయాలపై ముందుగానే ప్రకటన చేస్తుంది. ఇక బీజేపీ నిర్ణయం తీసుకుంది అంటే తప్పనిసరిగా అమలు చేస్తుంది. అలాంటి బీజేపీ ఈసారి 400 సీట్లకు పైగా సాధించి అధికారంలోకి వస్తే మాత్రం ఈ పనులు అమలు చేస్తుందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన సమయంలో అయోధ్య రామ మందిర నిర్amith shah;bjp;modi;article 370;pok;nda{#}Article 370;Ayodhya;West Bengal - Kolkata;Amith Shah;Jammu and Kashmir - Srinagar/Jammu;Bharatiya Janata Party;Pakistan;Government;Indiaబీజేపీ గద్దెనెక్కితే జరిగేది ఇదేనట.. అమిత్ షా ఏమంటున్నారంటే..?బీజేపీ గద్దెనెక్కితే జరిగేది ఇదేనట.. అమిత్ షా ఏమంటున్నారంటే..?amith shah;bjp;modi;article 370;pok;nda{#}Article 370;Ayodhya;West Bengal - Kolkata;Amith Shah;Jammu and Kashmir - Srinagar/Jammu;Bharatiya Janata Party;Pakistan;Government;IndiaThu, 16 May 2024 14:24:40 GMTబీజేపీ కూడా ఒకటి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇదే తరుణంలో బీజేపీ మళ్లీ పూర్తిస్థాయిలో అధికారంలోకి వస్తే వారు తీసుకునే నిర్ణయాలపై ముందుగానే ప్రకటన చేస్తుంది. ఇక బీజేపీ నిర్ణయం తీసుకుంది అంటే తప్పనిసరిగా అమలు చేస్తుంది. అలాంటి బీజేపీ ఈసారి 400 సీట్లకు పైగా సాధించి అధికారంలోకి వస్తే మాత్రం ఈ పనులు అమలు చేస్తుందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన సమయంలో అయోధ్య రామ మందిర నిర్మాణం చేసింది.

అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఒకే దేశం ఒకే చట్టం అంటూ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసి వాటిని అమలు చేసింది.  మరోసారి బీజేపీ 400 సీట్లతో అధికారంలోకి వస్తే ఈ పనులు తప్పక చేసి చూపిస్తామని అమిత్ షా ప్రతి సభలో వ్యాఖ్యానిస్తున్నారు. (పిఓకే) పాక్ ఆక్రమిత కాశ్మీర్  గురించి ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400 సీట్లతో అధికారంలోకి వస్తే  పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి భారత్ లో కలుపుతామని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ లోని శ్రీరాంపూర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో చాలా స్వేచ్ఛగా బతుకుతున్నారని అన్నారు. 2019లో బిజెపి తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లే ఇది సాధ్యమైందని తెలియజేశారు.

పిఓకే భారత్ లో భాగమని దీన్ని తిరిగి వెనక్కి తీసుకుంటామని ఆయన ఆ సభలో తెలియజేశారు. పాకిస్తాన్ దగ్గర అనుబాంబులు ఉన్నాయని మణిశంకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పి కొట్టారు. అయినా పిఓకే ని వెనక్కి తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుందని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. అలాగే దేశ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారా లేదంటే మన దేశాన్ని ఇతర దేశాలకు అప్పగించే వ్యక్తులకు ఓటేస్తారా అని అన్నారు. ఈ విధంగా బిజెపి రిజర్వేషన్లు రద్దు చేస్తాం, రాజ్యాంగాన్ని తీసేస్తాం అనే వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తే మాత్రం తప్పనిసరిగా వారు అన్న పని చేసి తీరుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>