Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr03b72332-bda7-4ea1-accf-0872d8badcb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr03b72332-bda7-4ea1-accf-0872d8badcb3-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎంతలా హడావిడి నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు సైలెంట్ అయ్యాయి. అయితే ఇప్పుడు సైలెంట్ గానే అన్ని పార్టీలు మరో ఎన్నికపై కూడా దృష్టి సారించాయి అన్నది తెలుస్తుంది. అదే ఈ నెల చివరన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికఫై. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు కూడా అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూడు జిల్లాల నేతలతో ఆయా Kcr{#}Warangal;రాజీనామా;Nalgonda;Parliment;Tamarind;KTR;MLA;revanth;Telangana;politics;Congress;Yevaru;Bharatiya Janata Party;Party;Reddyతెలంగాణలో తగ్గని పొలిటికల్ ఫీవర్.. మరో ఎన్నికపై పార్టీల ఫోకస్?తెలంగాణలో తగ్గని పొలిటికల్ ఫీవర్.. మరో ఎన్నికపై పార్టీల ఫోకస్?Kcr{#}Warangal;రాజీనామా;Nalgonda;Parliment;Tamarind;KTR;MLA;revanth;Telangana;politics;Congress;Yevaru;Bharatiya Janata Party;Party;ReddyThu, 16 May 2024 11:00:00 GMTమొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎంతలా హడావిడి నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది.  దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు సైలెంట్ అయ్యాయి. అయితే ఇప్పుడు సైలెంట్ గానే అన్ని పార్టీలు మరో ఎన్నికపై కూడా దృష్టి సారించాయి అన్నది తెలుస్తుంది. అదే ఈ నెల చివరన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికఫై. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు కూడా అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూడు జిల్లాల నేతలతో ఆయా పార్టీలన్నీ కూడా ఇక ఇప్పటికే మీటింగ్లను ప్రారంభించాయి అన్నది తెలుస్తుంది.



 పట్టభద్రుల స్థానంపై పట్టు కోసం ఇక అన్ని పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయ్. దీంతో ఇక పార్లమెంట్ ఎన్నికల హడావిడి ముగిసింది. రాజకీయాలు చల్లబడతాయి అనుకునే లోపే మరో ఎన్నిక రావడంతో ఎన్నికల మూడ్ మాత్రం ఇంకా పోలేదు. పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఇక ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న, బిఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బిజెపి నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని అటు గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.


 ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుని.. ఉపఎన్నికలో కూడా దెబ్బ కొట్టాలని అనుకుంటుంది.  అయితే ఇప్పటికే కేటీఆర్ అటు గులాబీ పార్టీ నేతలు అందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇక రేవంత్ కూడా ఇక ఈ ఉపఎన్నికపై గట్టిగానే ఫోకస్ చేశారు. ఇటీవల ఆయా జిల్లాల నేతలతో రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 మంది ఎమ్మెల్యే స్థానాలు ఉండగా.. అందులో 33 మంది స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో ఇక వారందరూ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కీలకంగా పనిచేయాలని రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇంకోవైపు తెలంగాణలో పట్టు సాధించాలనుకుంటున్న బీజేపీ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలి పార్లమెంట్ ఎన్నికల ముగియడంతో.. పూర్తిగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పైన ఫోకస్ చేసింది. దీంతో ఇక ఎమ్మెల్సీ ఉపఎన్నిక సహా ఆ తర్వాత రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరు విజయం సాధించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>