PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagans-embezzlement-case-that-came-up-againc17cd43c-290c-479b-9f22-cfd796fb0ff8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagans-embezzlement-case-that-came-up-againc17cd43c-290c-479b-9f22-cfd796fb0ff8-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ ఒకే ఒక్క డైలాగ్ తో ఏపీ పొలిటికల్ లెక్కలను మార్చేశారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 సంవత్సరం ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలతో వైసీపీ చరిత్ర సృష్టించగా ఈ ఎన్నికల్లో అంతకు మించి ఫలితాలు సాధిస్తానని జగన్ చెప్పడం కూట‌మి నేత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. జగన్ కు నమ్మకం లేకుండా ఎలాంటి కామెంట్లు చేయరని కూటమి నేతలు సైతం బలంగా విశ్వసిస్తారు. jagan{#}Josh;war;Rayalaseema;Hanu Raghavapudi;Assembly;YCP;MP;CM;Jagan;Andhra Pradeshమూడ్ ఆఫ్ ఏపీ : ఒక్క డైలాగ్‌తో కూట‌మి నేత‌ల‌కు నిద్ర లేకుండా చేసిన జ‌గ‌న్ ?మూడ్ ఆఫ్ ఏపీ : ఒక్క డైలాగ్‌తో కూట‌మి నేత‌ల‌కు నిద్ర లేకుండా చేసిన జ‌గ‌న్ ?jagan{#}Josh;war;Rayalaseema;Hanu Raghavapudi;Assembly;YCP;MP;CM;Jagan;Andhra PradeshThu, 16 May 2024 16:30:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ ఒకే ఒక్క డైలాగ్ తో ఏపీ పొలిటికల్ లెక్కలను మార్చేశారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019 సంవత్సరం ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలతో వైసీపీ చరిత్ర సృష్టించగా ఈ ఎన్నికల్లో అంతకు మించి ఫలితాలు సాధిస్తానని జగన్ చెప్పడం కూట‌మి నేత‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. జగన్ కు నమ్మకం లేకుండా ఎలాంటి కామెంట్లు చేయరని కూటమి నేతలు సైతం బలంగా విశ్వసిస్తారు.
 
జగన్ చేసిన ఈ కామెంట్లు వైసీపీ నేతల్లో, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాయి. జగన్ చేసిన కామెంట్లతో ఏపీలో బెట్టింగ్ ట్రెండ్ కూడా క్రమంగా మారుతోందని తెలుస్తోంది. జగన్ ఇప్పటికే ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి వేర్వేరు సంస్థలతో సర్వేలు చేయించుకోవడం జరిగింది. ఆ సర్వేల ఫలితాలకు సంబంధించి జగన్ కు అవగాహన ఉంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో జగన్ తీసుకున్న జాగ్రత్తలు అన్నీఇన్నీ కావు.
 
జగన్ చేసిన కామెంట్ల ప్రకారం రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే మాత్రం కూటమి భవిష్యత్తులో సైతం రాయలసీమ జిల్లాలలో కోలుకునే పరిస్థితి అయితే ఉండదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని భావిస్తున్న చంద్రబాబు, లోకేశ్, పవన్, బాలయ్యలకు జగన్ కామెంట్లు బలంగా బాణంలా గుచ్చుంటాయని చెప్పవచ్చు.
 
వాస్తవానికి 2019లో కుటుంబ సభ్యుల నుంచి జగన్ కు పూర్తిస్థాయిలో సపోర్ట్ లభించింది. ఈ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభించకపోయినా ఫలితాలు వార్ వన్ సైడ్ అయితే మాత్రం జగన్ అంటే ప్రజల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందో ఇతర రాష్ట్రాల ప్రజలకు, నేతలకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. జగన్ లెక్క తప్పదని ఆయన సన్నిహితులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>