PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababua9180b14-d6f4-4133-997e-a8b6e169a023-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababua9180b14-d6f4-4133-997e-a8b6e169a023-415x250-IndiaHerald.jpgఏపీలో ఎవరు గెలుస్తారు అనే చర్చతో పాటు జగన్ ఓడితే ఏం జరుగుతుంది? చంద్రబాబు పరాజయం పాలైతే పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లలో మొదులుతున్నాయి. గెలుపు గుర్రం ఒక్కరినే వరిస్తుంది. మరి ఓటమి పాలైన నేతల పరిస్థితి ఏంటి అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరు ఓడినా ఎవరూ గెలిచినా ఏం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కచ్ఛితంగా పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా.. మళ్లీ ఎన్నికల నాటికి అంతా సెట్ రైట్ అవుతుందని చెబుతున్నారు. మనం కొన్ని ఉదాహరణలు గమనిస్తchandrababu{#}KCR;Manam;Yevaru;Hanu Raghavapudi;CBN;Congress;Janasena;Jagan;Party;TDPఏపీ: చంద్రబాబు ఓడితే యమా అర్జంటుగా జరిగేది ఇదే?ఏపీ: చంద్రబాబు ఓడితే యమా అర్జంటుగా జరిగేది ఇదే?chandrababu{#}KCR;Manam;Yevaru;Hanu Raghavapudi;CBN;Congress;Janasena;Jagan;Party;TDPThu, 16 May 2024 07:16:00 GMTఏపీలో ఎవరు గెలుస్తారు అనే చర్చతో పాటు జగన్ ఓడితే ఏం జరుగుతుంది? చంద్రబాబు పరాజయం పాలైతే పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లలో మొదులుతున్నాయి. గెలుపు గుర్రం ఒక్కరినే వరిస్తుంది. మరి ఓటమి పాలైన నేతల పరిస్థితి ఏంటి అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు.


ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరు ఓడినా ఎవరూ గెలిచినా ఏం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కచ్ఛితంగా పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా.. మళ్లీ ఎన్నికల నాటికి అంతా సెట్ రైట్ అవుతుందని చెబుతున్నారు. మనం కొన్ని ఉదాహరణలు గమనిస్తే.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ పార్టీని లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గెలిచిన అందర్నీ తన పార్టీలోకి చేర్చుకున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ లో 5 ఎమ్మెల్యేలను మాత్రమే మిగిల్చారు. ఒకానొక దశలో కాంగ్రెస్ ఇక తెలంగాణలో చచ్చిన పాము అనే భావనకు అందరూ వచ్చేశారు. కానీ ఎన్నికల నాటికి ఆ పార్టీ పుంజుకొని ఏకంగా అధికారంలోకి వచ్చింది.


ఏపీలో సైతం 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయిన టీడీపీ.. ఇక కనుమరుగు అవుతుందని అంతా చర్చించుకున్నారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీకి, టీడీపీకి మధ్య అధికారం నువ్వానేనా అన్న రేంజ్ లో ఫైట్ సాగింది. అందువల్ల ఓటమి అనంతరం పార్టీలకు చిన్న చిన్న ఒడిదొడుకులు సహజం. కానీ వాటిని తట్టుకొని ఎన్నికల నాటికి ఆయా పార్టీలు సిద్ధం అవుతాయి.


ఇక చంద్రబాబు ఓటమి పాలైన పెద్దగా వచ్చే నష్టమేమీ ఉండదు. కాకపోతే ఆయన మాటకు పార్టీలో విలువ కొంత తగ్గుతుంది. ఇప్పటి వరకు అన్ని పార్టీలను కనుసైగతో శాసించిన ఆయన కొద్దిగా పట్టు కోల్పోతారు. పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తుంది.  భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సవాళ్లు అయితే ఎదురవుతాయి. పార్టీని, నాయకుల్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ సారి ఎన్నికల్లో జనసేన కూడా ప్రత్నామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.  వైసీపీతో పాటు జనసేనను టీడీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే ఇవన్నీ పక్కకి వెళ్లిపోతాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>