MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashish5010cf99-d0a9-4d04-b2f1-a480931275af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashish5010cf99-d0a9-4d04-b2f1-a480931275af-415x250-IndiaHerald.jpgరౌడీ బాయ్స్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటువంటి ఆశిష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన హీరోగా రూపొందిన రౌడీ బాయ్స్ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ ఇతను మాత్రం ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన కమర్షియల్ విజయం కోసం ప్రస్తుతం ఎంతో కసిగా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈయన సెల్ఫీస్ అనే మూవీ ని కూడా మొదలు పెట్టాడు. ఆ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆగిపోయింది. ఇక మరి కొంత కాలం లోనే సెల్ఫిష్ మూవీ రీ స్టార్ట్ కాబోతునAshish{#}Chaitanya;Ashish Vidyarthi;Posters;Evening;Love;Event;Cinema;Silver"లవ్ మీ" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వేదిక ఖరారు..!"లవ్ మీ" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వేదిక ఖరారు..!Ashish{#}Chaitanya;Ashish Vidyarthi;Posters;Evening;Love;Event;Cinema;SilverThu, 16 May 2024 12:29:13 GMTరౌడీ బాయ్స్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటువంటి ఆశిష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన హీరోగా రూపొందిన రౌడీ బాయ్స్ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ ఇతను మాత్రం ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన కమర్షియల్ విజయం కోసం ప్రస్తుతం ఎంతో కసిగా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈయన సెల్ఫీస్ అనే మూవీ ని కూడా మొదలు పెట్టాడు. ఆ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆగిపోయింది. 

ఇక మరి కొంత కాలం లోనే సెల్ఫిష్ మూవీ రీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సెల్ఫిష్ మూవీ రీ స్టార్ట్ అయ్యే లోపు ఈయన లవ్ మీ అనే ఓ సినిమాను కంప్లీట్ చేశాడు. ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ... అరుణ్ భీమవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈయన ఈ సినిమాతోనే దర్శకుడగా తన కెరీర్ ను మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమాను మే 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల కోసం ఓ ఈవెంట్ ను చేయబోతున్నట్లు అందుకు సంబంధించిన వేదికను ఖరారు చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదు లోని ఏ ఏ ఏ సినిమాస్ నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>