PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan1d41cc79-c874-4818-922c-95f6da52390c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan1d41cc79-c874-4818-922c-95f6da52390c-415x250-IndiaHerald.jpgఏపీలో రాష్ట్ర రాజకీయం ఒకెత్తు అయితే.. కడపలో మరో ఎత్తులా అన్నట్లు పరిస్థితి మారింది. ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర ఫైట్ కడపలో చోటు చేసుకుంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇక్కడి నుంచి పోటీ చేయడం.. వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి బరిలో నిలిచిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె ప్రభావం జగన్ పై పడుతుందా అనే ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. ముఖ్యంగా వారసత్వం గురించి ప్రధాన చర్చ సాగింది. దీనికి తోడు తన అన్న తనకు jagan{#}avinash;Y. S. Rajasekhara Reddy;Yevaru;Sharmila;Andhra Pradesh;Jagan;TDP;YCPఏపీ: జగన్ ఊహించని స్థాయిలో షర్మిల ప్రభావం?ఏపీ: జగన్ ఊహించని స్థాయిలో షర్మిల ప్రభావం?jagan{#}avinash;Y. S. Rajasekhara Reddy;Yevaru;Sharmila;Andhra Pradesh;Jagan;TDP;YCPThu, 16 May 2024 07:11:00 GMTఏపీలో రాష్ట్ర రాజకీయం ఒకెత్తు అయితే.. కడపలో మరో ఎత్తులా అన్నట్లు పరిస్థితి మారింది.  ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర ఫైట్ కడపలో చోటు చేసుకుంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇక్కడి నుంచి పోటీ చేయడం.. వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి బరిలో నిలిచిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.  అయితే షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె ప్రభావం జగన్ పై పడుతుందా అనే ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. ముఖ్యంగా వారసత్వం గురించి ప్రధాన చర్చ సాగింది.


దీనికి తోడు తన అన్న తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి దూసుకొచ్చారు.  ఫలితంగా ఆమె వైసీపీ ఓట్లకు గండి కొడుతుందని.. ఇది అంతిమంగా తమకే మేలు చేస్తుందని టీడీపీ నాయకులు భావించారు. అందుకు ఆమెకు మద్దతుగా మాట్లాడటం, తమ అనుకూల మీడియాలో ప్రాధాన్యం ఇవ్వడం వంటివి చేశారు.


ఇక షర్మిల కూడా తన రాజకీయ ప్రత్యర్థి కేవలం జగనే అన్నట్లు విమర్శలు చేశారు. ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినా.. ఇతర పార్టీలను విమర్శించింది చాలా తక్కువ. కేవలం వివేకా రాజకీయ హత్యను ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రచారం చేశారు. అయితే ఇది ఏపీ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుంది అన్నది ప్రశ్న.


ఎందుకంటే వివేకాను ఎవరు చంపారు అనే దానిపై ఆసక్తి ఉంటుంది కానీ.. దీని ప్రాతిపాదికన ఓట్లు పడవు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయమ్మ అనుకూలంగా మాట్టాడినా.. సగటు వైఎస్సార్ అభిమాని జగన్ నే ఆదరిస్తారు అనేది వాస్తవం. ఒకవేళ షర్మిలపై అభిమానం ఉన్నా.. ఆమె ఆద్యంతం జగన్ నే తిడుతూ ప్రచారం సాగించారు. ఇది ఎంతమాత్రం వైఎస్సార్ అభిమానికి రుచించదు. చంద్రబాబునో.. మోదీనో.. లేక పవన కల్యాణ్ ని విమర్శిస్తే వైసీపీ నాయకులు ఆమెవైపు మళ్లే అవకాశం ఉండేది. ఇక షర్మిల ప్రభావం వైసీపీ పై కానీ.. వైఎస్ జగన్ పై కానీ.. ఏపీపై ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆమెపై సానుభూతి చూపినా.. ఓటు రూపంలో మాత్రం కన్వెర్ట్ కాదని తేల్చి చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>