PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-de-simhasanam-tv9-rajani-lekkalu740198d9-9b34-485e-b252-af6350ac9c1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-de-simhasanam-tv9-rajani-lekkalu740198d9-9b34-485e-b252-af6350ac9c1c-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటివరకయితే అధికారంలోకి వస్తామని అటు కూటమి, ఇటు వైసిపి పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి.ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్టీవీ అధినేత రవి ప్రకాష్ ముందుగానే సర్వే పేరుతో సంచలమైన విషయాలను వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. రవి ప్రకాష్ సర్వే పట్ల టిడిపి నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తే వైసిపి నాయకులు విమర్శలు మొదలు పెట్టారు.సరే జర్నలిజం అనేది అందర్నీ సంతృప్తి పరచదు కాబట్టి రవిasembly elections{#}Ravi Prakaash;TV9;advertisement;Survey;Party;television;June;Elections;TDP;YCP;Jagan;Andhra Pradeshఏపీ : జగన్ దే సింహాసనం .. టీవీ9 రజని లెక్కలు..!!ఏపీ : జగన్ దే సింహాసనం .. టీవీ9 రజని లెక్కలు..!!asembly elections{#}Ravi Prakaash;TV9;advertisement;Survey;Party;television;June;Elections;TDP;YCP;Jagan;Andhra PradeshThu, 16 May 2024 14:11:28 GMTఏపీలో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటివరకయితే అధికారంలోకి వస్తామని అటు కూటమి, ఇటు వైసిపి పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి.ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్టీవీ అధినేత రవి ప్రకాష్ ముందుగానే సర్వే పేరుతో సంచలమైన విషయాలను వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. రవి ప్రకాష్ సర్వే పట్ల టిడిపి నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తే వైసిపి నాయకులు విమర్శలు మొదలు పెట్టారు.సరే జర్నలిజం అనేది అందర్నీ సంతృప్తి పరచదు కాబట్టి రవి ప్రకాష్ సర్వేను అలా వదిలేస్తే, ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తెరపైకి సంచలనమైన విషయాన్ని వెల్లడించారు.

ఏపీలో పెరిగిన పోలింగ్ అధికార పార్టీకి అనుకూలంగా మారిందని కచ్చితంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని గతంలో మాదిరి బంపర్ మెజారిటీ కాకపోయినా దాదాపు 100కు పైగా సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని దాన్ని పక్కన పెట్టేందుకే రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “పట్టణ ఓటర్లలో జగన్ పై వ్యతిరేకత ఉంది. కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీకి జై కొట్టారు. కచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని” రజనీకాంత్ వ్యాఖ్యలు చేయడం విశేషం.అయితే తన ఆర్ టీవీ ద్వారా రవి ప్రకాష్ చేసిన సర్వేలో కూటమికి అధికారంలోకి వస్తుందని చెబితే పోలింగ్ ముగిసిన తర్వాత అదే రవి ప్రకాష్ శిష్యుడు రజనీకాంత్ ఏకంగా వైసిపి అధికారంలోకి వస్తుందని ప్రకటించాడు. అంటే గురు శిష్యులు పార్టీలుగా విడిపోయారన్నమాట. ఇంతకీ గురు శిష్యులు చెప్పిన జోస్యం లో ఎవరికి అధికారం దక్కుతుందో, ఎవరికి ప్రతిపక్ష స్థానం లభిస్తుందో జూన్ 4న తేలనుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>